ఉబర్ యూజర్ల కోసం రియల్-టైమ్ కొత్త సేప్టీ ఫీచర్ ఇదిగో

Submitted on 22 February 2020
Uber app adds safety feature to let you report a problem from the car

ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్ తమ రైడర్ల కోసం కొత్త సేఫ్టీ ఫీచర్ ప్రవేశపెట్టింది. రియల్ టైమ్‌లో రైడర్లకు అభద్రతాభావం కలిగిన పరిస్థితుల్లో రిపోర్టు చేసేందుకు ఈ ఫీచర్ వారికి అనుమతి ఇస్తుంది. గతంలో యూజర్లు తమ రైడ్ పూర్తి అయ్యేంతవరకూ ఎదురైన పరిస్థితులను డ్రైవర్‌కు రిపోర్టు చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ సమస్య ఉండదు. ఈ కొత్త ఫీచర్ ద్వారా డ్రైవర్లు ఘటనకు సంబంధించి యాప్‌లో రిపోర్టు చేయొచ్చు.

మీరు ఉబర్ రైడ్ బుక్ చేసిన సమయంలో ఉబర్ డ్రైవర్ ఎవరైనా మీకు అనుచితమైన ప్రశ్నలు అడగడం లేదా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీరు కారులో ఉన్నప్పుడు యాప్ ద్వారా లాగిన్ అవ్వండి. అందులో కనిపించే బ్లూ షీల్డ్ పై రిపోర్టు సేఫ్టీ ఇన్సిడెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు త్వరితంగా ఘటనకు సంబంధించి పరిస్థితులను తెలియజేసే అవకాశం ఉంటుంది. 

‘ఈ సేఫ్టీ ఫీచర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఏమి జరుగుతుందో మీకు వెంటనే తెలిసిపోతుంది. ఉబర్ కంపెనీకి సమాచారం అందుతుంది. ప్రతిఒక్క యూజరుకు ఎంతో సురక్షితంగా ఉంటుంది’ అని ఫోర్ట్ మైయర్స్ నివాసి జెన్ లోరైన్ తెలిపారు. రైడ్ సమయంలో భయాందోళనకు గురికాకుండా ఈ ఫీచర్ సహకరిస్తుందని మరో యూజర్ తెలిపారు. ఈ సేఫ్టీ ఫీచర్ ఎలా పనిచేస్తుందో యూజర్లకు తెలియజేసేందుకు సమాచారంతో కూడిన వీడియోను ఉబర్ అందిస్తోంది. 

ఉబర్ యాప్‌లో బ్లూ షీల్డ్ బటన్ పై యూజర్ క్లిక్ చేయగానే.. సేఫ్టీ టూల్ కిట్ కు మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడే మీకు రిపోర్ట్ సేఫ్టీ ఇన్సిడెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ట్రిప్ పూర్తి కాకముందే నాన్ ఎమర్జెన్సీ ఇష్యూను రిపోర్టు చేసేందుకు ఇది అనుమతిస్తుంది. ట్రిప్ తర్వాత నుంచి ఉబర్ సేఫ్టీ టీం దీనిని అనుసరిస్తుందని కంపెనీ తెలిపింది. ఉబర్ డ్రైవర్లలో ఎవరిపైనా ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందితే మాత్రం వారిపై ఉబర్ కంపెనీ చర్యలు తీసుకుంటుంది. 

Uber app
safety feature
Car
real-time safety feature
ride-sharing service'

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు