నిజామాబాద్‌లో మండుతున్న ఎండలు : 2 టన్నుల చేపల మృతి

Submitted on 27 May 2019
Two tons of fish died in the sun's heat Nizamabad

ఎండల తీవ్రతతో నిజామాబాద్‌ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఎండ వేడికి తట్టుకోలేక మనుషులే కాదు..జీవ రాశులు మృత్యువాత పడుతున్నాయి. చేపలు, నెమళ్లు మృతి చెందాయి. గత మూడు రోజులుగా సుమారు 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఉక్కపోత మరో మూడు రోజులు ఉంటుందంటున్నారు. 

ఎండల తీవ్రతతో నిజామాబాద్ జిల్లాలో 2 టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. వర్ని మండలం జకోరా శివారులోని పెద్ద చెరువులో ఎండలకు చెరువులో నీటీ మట్టం తగ్గడంతో పాటు నీటీ ఉపరితలం వేడెక్కడంతో చేపలు మృతి చెందాయని మత్స్య సహకార సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ వేడికి చేపలు చనిపోయి నీటిలో తెలిపోయాయని వాపోయారు. సుమారు 2లక్షల విలువ గల చేపలు చనిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Two tons
fish died
sun's heat
nizamabad

మరిన్ని వార్తలు