యూజర్లకు షాక్ : మళ్లీ నిలిచిపోయిన ట్విట్టర్ సర్వీసులు!

Submitted on 13 July 2019
Twitter suffers second service disruption in more than one week

ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ మళ్లీ మొరాయించింది. మళ్లీ ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. వారంలో వరుసగా ట్విట్టర్ సర్వీసులకు అంతరాయం కలగడం ఇది రెండోసారి. జూలై 3న DM డెలివరీ, నోటిఫికేషన్లు, ట్వీట్ పోస్టు చేయడంలో సమస్యలు తలెత్తాయి.

కొంతమంది ట్విట్టర్ యూజర్లు కనీసం అకౌంట్లను కూడా లాగిన్ కాలేకపోయారు. ట్విట్టర్ సర్వీసుల్లో తలెత్తిన సాంకేతిక లోపంపై యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ట్విట్టర్.. టెక్నికల్ ఇష్యూల కారణంగా అంతరాయం కలిగినట్టు తెలిపింది. కొన్ని గంటల్లో మళ్లీ ట్విట్టర్ సర్వీసులు యథాతథంగా కొనసాగాయి.  
Also Read : ఫీచర్లు అదుర్స్ : శాంసంగ్ గెలాక్సీ నోట్ 10+ వచ్చేస్తోంది

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సహా పలు ఆన్ లైన్ వెబ్ సైట్లలో గురువారం (జూలై 11 నుంచి) సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు డౌన్ డిటెక్టర్ రిపోర్టు పేర్కొంది. దీనిపై ట్విట్టర్ స్టేటస్ పేజీ.. యాక్టీవ్ ఇన్సిడెంట్ కారణంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై ఎఫెక్ట్ పడినట్టు తెలిపింది. వారంలో ఇది రెండోసారి ట్విట్టర్ సర్వీసులకు అంతరాయం కలిగినట్టు డౌన్ డిటెక్టర్ నివేదించింది.

కొన్ని రోజుల క్రితం.. వాట్సాప్, ఫేస్ బుక్ సర్వీసులకు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ కాకపోవడంతో యూజర్లంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూజర్ల ఫిర్యాదులతో స్పందించిన వాట్సాప్, ఫేస్ బుక్ యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టింది.   
Also Read : డిజిటల్ ఇండియా : కేంద్ర ప్రభుత్వం అందించే 7 యాప్స్ ఇవే

Twitter
 second service
Disruption
One Week
service outage 

మరిన్ని వార్తలు