శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు : భక్తులకు ఊరట

Submitted on 17 November 2019
ttd laddu prasadam rates

త్వరలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచనున్నారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చారు. లడ్డూ ప్రసాదం పెంచడం లేదన్నారు. లడ్డూ ధర పెంచకూడదని నిర్ణయించామన్నారు.


భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేవీ టీటీడీ తీసుకోదన్నారాయన. చెన్నైలో శ్రీవారి ఆలయానికి తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఆగమశాస్త్రాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణానికి అనుకూలమా లేదా అనే విషయం త్వరలో నిర్ణయిస్తామన్నారు.

అతిథి గృహాల అద్దె పెంపుపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. చెన్నై స్థానిక సలహామండలి కమిటీ టీటీడీలో బాధ్యతలు స్వీకరించింది. దీనికి చీఫ్ గెస్ట్ గా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. భక్తులకు రిలీఫ్ ఇచ్చారు.

త్వరలో శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీ, విక్రయాల్లో రాయితీలకు టీటీడీ మంగళం పాడనుందని... లడ్డూ ధర రెట్టింపు కానుందని వార్తలొచ్చాయి. ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇచ్చి.. ఆపై రూ.50కి ఒక లడ్డూ విక్రయించేలా టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోందని వార్తలు వినిపించాయి. దీంతో భక్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. టీటీడీ చైర్మన్ తాజా ప్రకటనతో ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.

TTD
laddu prasadam
rates
YV Subba Reddy
srivaru

మరిన్ని వార్తలు