అద్దె బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ పిటిషన్

Submitted on 22 October 2019
TSRTC labor union Petition, challenging the tenders of rental buses

అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం పిటిషన్ దాఖలు చేసింది. సమ్మె తేల్చకుండా 1035 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆర్టీసీకి బోర్డు లేకుండా.. ఇంచార్జి ఎండీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధమని వాదించారు.  

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకుంటున్నట్టు ఆర్టీసీ హైకోర్టుకు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో బస్సులు అద్దెకు తీసుకునే అధికారం ఉందన్న ఆర్టీసీ అదనపు ఏజీ.. ఆర్టీసీ సొంత బస్సులు నడిపే స్థితిలో లేదని తేల్చి చెప్పారు. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని హైకోర్టు ధర్మాసనం చెప్పిందని.. టెండర్ల ప్రక్రియ నిన్నటితో పూర్తయిందని తెలిపారు. దీంతో ధర్మాసనం వద్ద పెండింగులో ఉన్న పిల్‌తో జతపరచాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
 

TSRTC
labor union
Petition
challenging
tenders
rental buses
Hyderabad

మరిన్ని వార్తలు