దీక్ష భగ్నం : ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి అరెస్ట్

Submitted on 17 November 2019
TSRTC JAC Co-Convener Raji Reddy Initiation ruined

టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్‌లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజిరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులను కూడా అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. నిన్న రాజిరెడ్డిని హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ రాజిరెడ్డి ఇంటి తాళం పగలగొట్టి అరెస్టు చేశారు. 

రాజిరెడ్డి అరెస్టును జేఏసీ నేతలు ఖండించారు. ఇది కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎక్కడికక్కడే అణిచిపెడుతున్నారని వాపోయారు. చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించాలన్నారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డికి సంఘీభావంగా ఉంటామని తెలిపారు. ఎప్పటికీ ఆయనకు తోడుగా, వెన్నంటే ఉంటామని తెలిపారు. 

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న కార్మికులు.. 44వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇటు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది. అయితే...ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.

ఈ ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బీపీ 150, షుగర్ 196 ఉన్నట్లు తేల్చారు. వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోవాలని, ఆహారం తీసుకోవాలని అశ్వత్థామరెడ్డికి సూచించారు. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని హెచ్చరించారు.
 

TSRTC
JAC
Co-Convener
Raji Reddy
Initiation
ruined
Hyderabad

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు