హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు ఎర్రదండు సిద్ధం అవుతోంది. ఊరూవాడా అరుణపతాకాలు కవాతు తొక్కుతున్నాయి. హైదరాబాద్ బహిరంసభకు ప్రజలు తరలిరావాలని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లో సీపీఎం శ్రేణులు ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీపీఎం జాతీయ మహాసభలకు తెలుగు రాష్ట్రాల్లో పార్టీశ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈనెల 22న భారీ...
స్యూర్యాపేట : స్యూర్యాపేట జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలం వివాదస్పదంగా మారింది. మంత్రి జగదీష్‌రెడ్డి తన అనుయాయులకు, రియల్ఎస్టేట్ వ్యాపారుల కోసమే కలెక్టరేట్ భవన సముదాయం నిర్మిస్తున్నారని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. జనసమ్మర్దం లేని ప్రాంతంలో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో...
హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...
హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్ ఓ సజీవ సాక్ష్యం.
ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...
హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...
సూర్యాపేట : జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. అర్వపల్లి మండలం కొమ్మల గ్రామంలో పెళ్లిపనులు చేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొకుడు తండ్రి సత్యనారాయణ, పెళ్లికొడుకు బావ శోభన్‌బాబు అక్కడిక్కడే చనిపోయారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
సూర్యపేట : జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ఈదురుగాలులు, వర్షాల బీభత్సానికి దాదాపు వంద ఎకరాల పంట నేలమట్టం అయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడితోటలు, బత్తాయి తోటలు కాయరాలిపోయి తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే...
సూర్యాపేట : హుజూర్ నగర్ మండలంలోని బురుగుగడ్డ గ్రామంలోని ఆది లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సందర్శించారు. స్వామి వారి తిరు కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్ డౌన్ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....
సూర్యాపేట : కాంగ్రెస్ బస్సు యాత్ర ఆలీబాబా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్.. ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగల్లా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్.. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ శుభదినమన్నారు. ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టేందుకు మిషన్ భగీరథను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 175 జనావాసాలకు మంచినీళ్లు ఇస్తున్నామన్నారు....
సూర్యపేట : జిల్లా గంజాయి కలకలం రేగింది. గాయత్రి కాలేజీ హాస్టల్ లో అర్ధరాత్రి వంద కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని విద్యార్థిసంఘాలు పోలీసులకు పట్చించాయి. విద్యాబోధన ముసుగులో యాజమాన్యం గంజాయి వ్యాపారం చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నింధితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.