Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Tuesday, April 10, 2018 - 21:59

సిద్ధిపేట : 2019 ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్‌ గార్డెన్‌లో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఈనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతాయన్నారు. 22న భారీ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. అలాగే ఈ నెల 13...

Sunday, April 1, 2018 - 09:39

సిద్ధిపేట : పోరాటాల గడ్డ సిద్దిపేటలో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. దేశం కోసం, రాష్ట్రం కోసం అమరులైన వారందరికి హరీష్‌రావు జోహార్లు తెలిపారు. అమరుల త్యాగ ఫలితంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని... అందరూ కలిసి ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే అన్నారు. ఇక ఏప్రిల్‌ ఫూల్‌తో అందరూ సమయం వృధా చేసుకోకుండా... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. ఏప్రిల్‌ నెలను కూల్‌...

Friday, March 30, 2018 - 18:43

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని అని అన్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఆయన ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి.. మహదేవపూర్ మండలం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌కు వివరించారు...

Tuesday, March 27, 2018 - 06:31

సిద్దిపేట : జిల్లా చిన్న చంద్లాపూర్ వద్ద రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో అధికారులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు తొందరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. 

 

Saturday, March 17, 2018 - 14:00

సిద్దిపేట : జిల్లా హుస్నాబాద్‌ ఆర్ డీవో కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ భూ సమస్య పరిష్కరించాలని నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాయి. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య యత్నం చేశారు.  తమకున్న మూడెకరాల భూమిలో ఎకరంనర భూమి   ఇతరుల పేరు పై రిజిస్ట్రేషన్‌ అయిందని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Friday, March 2, 2018 - 20:09

సిద్దిపేట : అనంతగిరి, రంగనాయక ప్రాజెక్ట్‌లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.  పనులను వేగవంత చేయాలన్నారు.  వచ్చే వర్షకాలం నాటికి రైతులకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల పరిహారం వీలైనంత త్వరగా ముగించాలన్నారు...

Pages

Don't Miss