Monday, June 18, 2018 - 18:25

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ ప్రభంజనంలో కూడా జహీరాబాద్‌ నుంచి గెలుపొందిన నేత గీతారెడ్డి. అలాంటి కీలక నేతకే టీఆర్ఎస్‌ చెక్‌ పెట్టనుందా... అంటే.. అవుననిపించేలా కనిపిస్తున్నాయి పరిణామాలు. నేరుగా మంత్రి హరీష్‌రావే గీతారెడ్డిని టార్గెట్‌ చేసినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా మారుతున్న జహీరాబాద్‌ నియోజకవర్గ పాలిటిక్స్‌పై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.

...

Sunday, June 17, 2018 - 18:13

సంగారెడ్డి : పఠాన్‌ చెరు మండలం ఐస్నాపూర్‌లో లారీ క్లీనర్‌ మృతి కలకలం రేపంది. పారిశ్రామికవాడలో లారీకి ఉరివేసుకొని క్లీనర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చత్తీస్‌గడ్‌ చెందిన వినోద్‌గా గుర్తించారు. అయితే.. మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Thursday, June 14, 2018 - 08:49

సంగారెడ్డి : పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. రాత్రిపూట అపార్ట్ మెంట్లలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది. సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిద్రహారాలుమాని ప్రజలు కాపలా కాస్తున్నారు. కర్రలు పట్టుకుని కాలనీల్లో గస్తీ తిరుగుతున్నారు.  

Thursday, June 14, 2018 - 07:32

సంగారెడ్డి : మిషన్‌ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో మిషన్‌ భగీరథ రిజర్వాయర్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.  
39 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం 
సంగారెడ్డి జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు...

Thursday, June 14, 2018 - 07:06

సంగారెడ్డి : తెలంగాణలో సంచలనం కలగిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ కదలికలు ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కనిపిస్తున్నాయి.  రాత్రి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పలు అపార్ట్‌మెంట్లలో చెడ్డీగ్యాంగ్‌ సంచరించిన ఆధారాలు లభించాయి. చెడ్డీగ్యాంగ్‌కు సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్లలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చెడ్డీగ్యాంగ్‌ సంచరిస్తోందన్న భయంతో... జనాలు నిద్రహారాలుమాని కాపలా...

Monday, June 11, 2018 - 18:56

సంగారెడ్డి : జిల్లా రామచంద్రాపురంలోని మార్గదర్శిని ఎడ్యుకేషనల్‌ సొసైటీలో స్థల వివాదం నెలకొంది. ఈ విషయమై సొసైటీ సభ్యులకు, స్కూల్‌ యాజమాన్యానికి మధ్య వివాదం చోటుచేసుకుంది. సొసైటీ ప్రెసిడెంట్ బాలయ్య స్థలం విషయమై యాజమాన్యాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లక్ష రూపాయలు డిమాండ్‌ చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు....

Friday, June 8, 2018 - 07:01

సంగారెడ్డి : రసాయన పరిశ్రమల కాలుష్యంతో సంగారెడ్డి జిల్లాలో సగం జనాభా అతలాకుతలం అవుతోంది. పరిశ్రమలు వెదజల్లే జాల వాయువు కాలుష్యంతో ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. వీటికి తోడు మరో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై సంగారెడ్డి జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మూడు పరిశ్రమలు వచ్చిపడ్డాయి. వీటి వల్ల ఉపాధి అవకాశాలు...

Thursday, June 7, 2018 - 17:30

సంగారెడ్డి : గులాబీ పార్టీ నేతల్లో  అంతర్గతపోరు తారా స్థాయికి చేరుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య   సమన్వయలోపం  పలు నియోజకవర్గాల్లో  సమస్యలు సృష్టిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కొనసాగిన నేతలకు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన  నాయకులకు  మధ్య  చిటపటలు తీవ్రతరం అవుతున్నాయి. సంగారెడ్డిజిల్లా నారాయణఖేడ్‌లో గులాబీనేతల అంతర్గత విభేదాలు జిల్లా పాలిటిక్స్‌ను...

Wednesday, June 6, 2018 - 11:44

సంగారెడ్డి : జిన్నారం మండలం గడ్డిపోతారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాహాని జరగలేదు. కానీ కోట్ల రూపాల ఆస్తికి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్య్కూలే కారణంగా...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Pages

Don't Miss