Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Sunday, April 8, 2018 - 21:14

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. పలు...

Wednesday, April 4, 2018 - 07:15

రాజన్న సిరిసిల్ల : గత రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదిహేను వందల ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని జిల్లా లెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. ముస్తాఫాబాద్‌, ఎల్లారెడ్డిలో వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్యతో పాటు.. పలువురు...

Wednesday, April 4, 2018 - 07:11

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అమాయకులైన రైతుల భూములను లాగేసుకుంటున్నారు. వడ్డీకి డబ్బులు ఇవ్వడం.. వాటిపై చక్రవడ్డీ, బారువడ్డీల పేరుతో డబ్బులు గుంజడం.... కట్టలేని వారి నుంచి భూములు లాగేసుకోవడం ఇక్కడి నేతలకు పరిపాటిగా మారింది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ రైతులకు డబ్బులిచ్చిన గులాబీ నేత... ఆ రైతుకు తెలియకుండానే అతని భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్‌...

Monday, April 2, 2018 - 19:36

రాజన్న సిరిసిల్ల : జిల్లా ముంపు గ్రామ మహిళలు కలెక్టరేట్ ముందు మండుటెండలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం చేవెళ్ళప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా మాన్వాడ వద్ద మిడ్ మానేరు జలాశయాన్ని నిర్మిస్తోంది. అందులో భాగంగా మాన్వాడను ముంపు గ్రామాన్ని ప్రకటించింది. కొంతమందికి  నష్ట పరిహారం రాకపోవడంతో డీఆర్ఓ శ్యాం ప్రసాద్ లాల్‌కు తెలపగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు.  ...

Tuesday, March 27, 2018 - 17:47

రాజన్న సిరిసిల్ల : కలెక్టర్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు రాస్తారోకో చేశారు. వేములవాడ నియోజకవర్గంలో 318 మంది బీడీ కార్మికులకు 18 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వాటిని రద్దు చేయోద్దంటూ వివిధ పార్టీల ఆధ్వరంలో ఆందోళన చేశారు. వీలైతే అక్కడే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని కార్మికులు డిమాండ్ చేశారు....

Monday, March 26, 2018 - 08:31

సిరిసిల్ల : వేములవాడ ఆలయ ప్రాంగణంలో కోడెలు ఒక బాలుడి ప్రాణాలు తీశాయి. ఈ విషాదకర ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదివారం ఆయలంలో శ్రీరాముడి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుండి కల్యాణం వీక్షించేందుకు తరలివచ్చారు. రాత్రి సమయంలో ఆలయ పార్కింగ్ స్థలంలో కొంతమంది భక్తులు నిద్రించారు. గాఢ నిద్ర ఉన్న సమయంలో కోడెల...

Sunday, March 25, 2018 - 19:00

రాజన్న సిరిసిల్ల  : శ్రీరామనవమి సందర్భంగా మేములవాడ దేవాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దైవదర్శనానికి వచ్చిన భక్తులుపై తమ ప్రతాపం చూపారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా నెట్టి వేయడం విమర్శలకు తావిచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ...

Pages

Don't Miss