Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Saturday, March 10, 2018 - 12:24

మంచిర్యాల :పురాతనమైన మొసళ్ళ పునరావాస కేంద్రం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. మంచిర్యాల జిల్లాలోని శివ్వారం దగ్గర ఉన్న ఎల్. మడుగు మొసళ్ళ సంరక్షణ కేంద్రం ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూపరులను ఇట్టే ఆకుట్టుకుంటుంది. సహజ సిద్దమైన ఈ మడుగులో 60 కి పైగా మొసళ్ళు.. సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి... అధికారులు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పిస్తే... పర్యాటక...

Saturday, March 10, 2018 - 12:09

వికారాబాద్ : వికారాబాద్‌ జిల్లా అత్తెల్లి గ్రామంలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో చంటి బిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో... మనస్థాపం చెందిన భార్య వరాలు బిడ్డతో కలిసి బావిలో దూకింది. భర్త వేధింపులే ఈ ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బావిలో నుండి శవాలను బయటికి...

Wednesday, March 7, 2018 - 20:56

మంచిర్యాల : జిల్లాలోని తాండూరు మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని రోడ్డుపై బైఠాయించారు. ఖాళీ కడుపులతో... ఎండలో ఆందోళన చేయడంతో  కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు... పాఠశాలలో వంటలు వండే స్థలాన్ని సందర్శించి సిబ్బందిని...

Monday, March 5, 2018 - 20:17

మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో కందులు కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని వామపక్షాల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. స్థానిక జాతీయ రహదారిపై కందులు కుప్పగాపోసి నిరసన తెలిపారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లక్సెట్టిపేట మార్కెట్‌ యార్డ్‌లో రెండు రోజులు మాత్రమే కందులు కొనుగోలు చేశారని చెప్పారు. పండించిన కందులు నిల్వ చేయలేక పోతున్నామని...

Sunday, March 4, 2018 - 13:00

మంచిర్యాల : గుప్త నిధుల కోసం మంచిర్యాల జిల్లాలో ఉన్న అరుదైన గుహలను అక్రమార్కులు తొలిచివేస్తున్నారు. గోదావరి తీరంలోని రాతిగుట్టపై ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించిన జైన దేవాలయాలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం, పురావస్తు శాఖాధికారులు పట్టించుకోవడంతో ప్రాచీన సందపకు రక్షణలేకుండా పోయింది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

Thursday, March 1, 2018 - 12:14

మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి మండలం చొప్పరపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక గ్రామానికి చెందిన కొండగొర్ల తిరుపతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం తిరుపతి భార్య భూదేవి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. అంతకు ముందు ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చారు. కూతురు కీర్తన, కుమారుడు శ్రీశాంత్‌ పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

Saturday, February 17, 2018 - 13:37

మంచిర్యాల : అటవీ శాఖ మంత్రి జోగురామన్నకు ప్రమాదం తప్పింది. మున్నూరుకాపు భవన ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భవన ప్రారంభోత్సవ సందర్భంగా బాణాసంచా పేల్చడంతో ఆ నిప్పు రవ్వలు పడి టెంట్ అంటుకుంది. మరింత సమాచారం కోసం వీడయిఓ క్లిక్ చేయండి.

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Pages

Don't Miss