Sunday, May 7, 2017 - 16:05

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దమ్మపేట, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మామిడికాయలు కోతకొచ్చిన దశలో భారీ వర్షం కురవడంతో పంట నేలపాటు కావడంతో రైతుల నష్టపోయారు. 

Friday, May 5, 2017 - 16:32

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో సీపీఎం మహిళా నాయకురాలు కాసాని లక్ష్మీ మృతికి సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు. సుజాతానగర్‌లో జరిగిన లక్ష్మీ అంతమయాత్రలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన సంతాపసభలో తమ్మినేని మాట్లాడారు. కాసాని లక్ష్మీ పార్టీకి ఎనలేని సేవచేశారని...

Saturday, April 22, 2017 - 18:00

సిర్పూర్ : ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలకు తాళలేక జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగలంతా వాతావరణం అగ్నిగుండంలా ఉంటోంది. వడదెబ్బలకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. కొమురం భీం జిల్లాలో పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. సాక్షాత్తు సిర్పూరు ఎమ్మెల్యే కొనేరు కోనప్పకే వడదెబ్బ తప్పలేదు.

కాగజ్‌నగర్‌, ...

Sunday, April 9, 2017 - 09:21

భద్రాద్రి కొత్తగూడెం : ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళుతూ మృత్యు ఓడిలోకి చేరుకున్నారు. ఈ విషాద ఘటన అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. పాల్వంచలో ఉన్న పెద్దమ్మ గుడికి వెళ్లడానికి ఓ కుటుంబం కిరాయి ఆటో తీసుకుంది. అందులో వెళుతున్నారు. కానీ మొండికుంట గ్రామ శివారు వద్దకు చేరుకోగానే మణుగూరుకు వేగంగా వెళుతున్న ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొట్టింది. దీనితో నలుగురు మృతి చెందారు. మృతి...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Friday, March 17, 2017 - 20:33

హైదరాబాద్ : అకాల వర్షాలతో తెలంగాణ రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. వడగళ్ల వానలతో కడగండ్లపాలు అవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పొలాల్లోనే తడిసి సర్వనాశనం కావడంతో దిగాలుపడ్డారు. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరేమార్గంలేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు హడలిపోతున్నారు. తెలంగాణలో...

Sunday, March 12, 2017 - 18:53

హైదరాబాద్ : రంగుల కేళీ హోలీ.. మరోసారి తెలంగాణలో సందడి చేసింది. చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసలివారి వరకు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రాజ్‌ భవన్‌లో జరిగిన సంబరాల్లో గవర్నర్ దంపతులతో పాటు... నేతలు పాల్గొని సందడి చేశారు. రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్‌ అందరికీ రంగులు...

Wednesday, March 8, 2017 - 12:39

కొత్తగూడెం : చిన్న వయస్సులోనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారింది. క్షౌరవృత్తిని కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక పక్క పని చేసుకుంటూ బతుకును వెళ్లదీస్తుంది.. మరో పక్క చదువును సాగిస్తూ భవిష్యత్తును కాపాడుకుంటుంది. మంచం పట్టిన తండ్రికి ఊరటగా నిలిచినా.. బిందుప్రియపై ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం..మొండికుంటలో కులవృత్తినే ఆధారం చేసుకుని.....

Thursday, March 2, 2017 - 11:57

హైదరాబాద్ : దశాబ్దకాలానికి పైగా లాభాల్లో తిరుగులేకుండా దూసుకుపోయిన సింగరేణి సంస్థ ఈ ఏడాది  భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో రూ.353కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆరు డివిజన్లలో ఏకంగా 1572కోట్ల రూయల  నష్టాలు వచ్చాయి. మరో నాలుగు డివిజన్లలో మాత్రం 1219కోట్ల లాభాలు వచ్చాయని సింగరేణి ప్రకటించింది. బొగ్గు ఉత్పత్తి లో వెనుకంజ వేయడం, డిమాండ్‌ తగ్గడమే నష్టాలకు...

Pages

Don't Miss