Saturday, August 19, 2017 - 16:38

జగిత్యాల : రోజూ కాలేజీకి ఆలస్యంగా వస్తున్నారు.. ఇది సరికాదని చెప్పినా మార్పులేదు... ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా విద్యార్థులూ క్రమశిక్షణ తప్పుతారు.. అందుకే విద్యార్థులకు బుద్ధి చెప్పాలనుకున్నాడో లెక్చరర్‌.. పనిష్‌మెంట్‌పేరుతో ఏకంగా జుట్టే కత్తిరించాడు.. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో జుట్టు కత్తిరింపుకూ తమకూ సంబంధం లేదన్నారు.. ఇందులో ఎవరిది నిజం?
కామర్స్‌...

Saturday, August 19, 2017 - 10:25

జగిత్యాల : జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అమానుషం జరిగింది. లెక్చరర్లు సమయానకి కాలేజీకి రాలేదని విద్యార్థుల జుట్టు కత్తిరించారు. లెక్చరర్లు పదిమంది విద్యార్థుల జుట్టు కత్తిరించారు. విద్యార్థులు సమయానికి కాలేజీ రావడంలేదంటూ, జుట్టును భారీగా పెంచి జులాయి లాగా కాలేజీ వచ్చినందుకు జుట్టు కత్తిరించినట్టు తెలుస్తోంది. ఇష్టంవచ్చినట్లు జుట్టు కత్తిరించడంతో విద్యార్థులు...

Friday, August 18, 2017 - 16:17

జగిత్యాల : జిల్లా కేంద్రం జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన భారీ వర్షానికి టవర్ సర్కిల్, తహసిల్ చౌరస్తా, రాంబజార్లలో రోడ్లు జలమయమయ్యాయి. జమ్మిగద్దె ప్రాంతంలో నాలాలు నిండి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

 

Saturday, July 29, 2017 - 18:13

జగిత్యాల : పిల్లలను.. కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతల్లులే.. గాలికొదిలేశారు. నీడగా ఉండాల్సిన వారే.. నిర్ధాక్షిణ్యంగా..విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ చిన్నారులు మాత్రం.. తల్లులు కోసం బెంగపెట్టుకున్నారు..అమ్మ పలకరింపు కోసం... అల్లాడిపోయారు. ఆరు నెలల తర్వాత కనిపించిన అమ్మ దగ్గరకు వెళ్లాలని ఆ పసివాళ్లు తహతహలాడిపోయారు. ఆ తల్లులు మాత్రం.. కన్నపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ ఘటన...

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Tuesday, July 11, 2017 - 13:12

జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్‌ మండలంలోని చర్లపల్లి గ్రామంలో.. దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని, ప్రియురాలి బంధువులు చంపిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. గత ఆరేళ్లుగా సుధాకర్‌, సుమ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సుమ బంధువులు సుధాకర్‌ను పిలిచి ప్రేమ విషయం గురించి మాట్లాడుతుండగా.. వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సుమ బంధువులు సుధాకర్‌పై గొడ్డలితో దాడి చేశారు. సుధాకర్‌కు బలమైన...

Sunday, July 9, 2017 - 13:55

జగిత్యాల : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మార్చురీలో మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి.. అర్షద్‌ పాషా అనే యువకుడు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు... జగిత్యాల ఆస్పత్రికి తరలించేవరకే అతను చనిపోయాడు.. మార్చురీలో డెడ్‌బాడీని భద్రపరిచారు.. ఈ మృతదేహాన్ని ఎలుకలు తిన్నాయంటూ అతని బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు..

 

Saturday, July 8, 2017 - 15:56

జగిత్యాల : జిల్లాలోని బిర్పూర్‌ మండలంలో రోళ్లవాగు రిజర్వాయర్‌ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. నర్సింహుళ్లపల్లె సమీపంలో 62 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల, ఎంపీ బాల్కసుమన్‌, విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం హరిశ్‌రావు, కవిత ధర్మపురిలో జరిగే బహిరంగ సభకు బయలుదేరారు.

 

Pages

Don't Miss