Monday, June 11, 2018 - 06:38

ఆసిఫాబాద్ : కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ మండలం శివపూర్‌లో వర్షాల కోసం గ్రామదేవతకు గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు విస్తారంగ కురిసి, పాడిపంటలు సంమృద్ధిగా పండాలని కోరతూ.. బోనాలు సమర్పించారు. ఇలా ప్రతి సంవత్సరం వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించడం తమ ఆనవాయితీ అని గ్రామస్థులు అన్నారు.

Friday, June 8, 2018 - 16:38

కొమురం భీం : సోనాపూర్‌లో ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఉనికిని ప్రమాదంలోకి నెడుతుంది సింగరేణి సంస్థ. నష్ట పరిహారం ఇవ్వకుండా ఆదివాసీల భూములను ప్రజాప్రతినిధులు, అధికారులు సింగరేణి సంస్థకు దౌర్జన్యంగా కట్టబెట్టారు. ఆదివాసీలకు వచ్చిన నష్టపరిహారాన్ని తమ బ్యాంక్ అకౌంట్లలో వేసుకున్న ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఎవ్వరి దగ్గరికి...

Thursday, June 7, 2018 - 19:52

ఆసిఫాబాద్‌ : ఎజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టాన్ని అనుసరిస్తూ... తమ గ్రామాల్లో స్వయం పాలన సాగిస్తున్నామంటున్నారు ఆదివాసులు.  జూన్‌ 2నుంచి ఆదివాసులు లంబాడ తెగకు చెందిన ఉద్యోగులను ఏజెన్సీ గ్రామల్లో అనుమతించడంలేదు. స్వయం పాలన ప్రకటించి, లంబాడాలను అడ్డుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామని ఆదివాసులంటున్నారు. ఊరి చివరిలో మావనాటే మావరాజ్‌, 'మావేనాటే.. మావే సర్కార్‌' అనే...

Thursday, June 7, 2018 - 19:47

ఆసిఫాబాద్‌ : జిల్లా రెబ్బెన మండలం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డులో వాటర్‌ పైప్‌లైన్‌ పగిలింది. మిషన్‌ భగీరథ పైప్‌ పగలడంతో భారీ ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. పైప్‌లైన్‌ రోడ్డుకు పక్కనే ఉండడంతో.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. నీరు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. 

 

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Pages

Don't Miss