Friday, August 18, 2017 - 17:22

పెద్దపల్లి : అధికారం లేదు..ఆర్భాటం లేదు..హోదా లేదు..జై కొట్టిన క్యాడర్‌ లేదు. నిరాశ, నిస్తేజంలో మునిగిపోయిన పెద్దపల్లి తెలుగు తమ్ముళ్లు.. రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గోడదూకేందుకు సిద్ధమవుతున్నారు. పెద్దపల్లి టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు సైకిల్‌ పార్టీకి టాటా చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవకాశం వస్తే...

Friday, August 18, 2017 - 16:45

పెద్దపల్లి : బీడు భూములకు సాగునీరందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన నిధులు కేటాయించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. పంటలకు సాగునీరందక చివరి ఆయకట్టు రైతాంగం యేటా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎత్తిపోతల ప్రాజెక్టులతో తమ రాతలు మారతాయని.. వాటికోసం ఎదురు...

Wednesday, August 16, 2017 - 19:24

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం సిరిపురం గ్రామంలో సుందిళ్ల బ్యారేజి భూనిర్వాసితులతో మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణపనులకు అడ్డువస్తున్నాడనే నెపంతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న నిర్వాసితుడు దాసరి చంద్రమోహన్‌ శ్రీధర్‌ బాబు పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతే రాజుగా ఉండేవాడని, నేడు తెలంగాణ ప్రభుత్వం రైతులను పోలీసులతో...

Tuesday, August 15, 2017 - 07:42

పెద్దపల్లి : జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం భారతీయ జాతీయతను చాటుతూ నిర్వహించిన కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కింది. ఈ మేరకు పోలీసులు మేరా భారత్‌ మహాన్‌ పేరుతో ఇరవై వేల జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి జూనియర్‌ కాలేజీ విద్యార్థులు భారతదేశ పటాన్ని ఆవిష్కరించారు. ఇరవై వేల విద్యార్థులతో కలిసి ఒకేసారి జాతీయ పతాకాన్ని...

Monday, August 14, 2017 - 17:55

పెద్దపల్లి : జిల్లా సిరిపురంలో సుందిళ్ల బ్యారేజీ పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. గోలివాడ నిర్వాహితులను చెల్లించిన పరిహారాన్నే తమకు కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రాజెక్టు వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. ఆందోళనకారులను ప్రాజెక్టు పరిసరాల్లోకి రానివ్వకుండా ప్రైవేటు సెక్యూరిటీతో కాంట్రాక్టుర్లు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిహారం కోసం ఆందోళన చేసిన ఒక...

Monday, August 14, 2017 - 16:04

పెద్దపల్లి : జిల్లా సిరిపురంలోని సుందిళ్ల బ్యారేజీ పనులను భూమి కోల్పోతున్న నిర్వాసితులు అడ్డుకున్నారు. గోలివాడ నిర్వాసితులతో సమానంగా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ప్రైవేటు సెక్యూరిటీ ఆందోళనకారులను బెదిరిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

Sunday, August 13, 2017 - 21:15

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం సిరిపురంలో భూ నిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపించారు. పరిహారం కోసం గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తున్న చంద్రమోహన్ అనే నిర్వాసితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. అయితే పోలీసులు తనను చిత్ర హింసలకు గురి చేస్తునట్లు జడ్జికి చంద్రమోహన్ ఫిర్యాదు చేశాడు. పోలీసుల తీరుపై గోదావరిఖని మున్సిఫ్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Saturday, August 12, 2017 - 06:55

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం...

Wednesday, August 2, 2017 - 09:25

పెద్దపల్లి : జిల్లా గోదావరిఖనిలోని శ్రీసాయి జ్యువెలరీ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. మరింత వివరాలకు వీడియో చూడండి.

Pages

Don't Miss