Friday, March 10, 2017 - 19:12

మహబూబాబాద్: తెలంగాణ పల్లెల్లో గొంతెండుతోంది. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో మంచినీటి కోసం జనం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండో పంటకు నీరివ్వడం వల్లే గ్రామంలో మంచినీటి కొరత ఏర్పడిందన్నారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తామన్న పాలకులు.. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల ప్రజల మంచినీటి కష్టాలపై...

Wednesday, March 8, 2017 - 17:35

హైదరాబాద్: దళితులకు మూడు ఎకరాల భూమి. ఇది టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అంతే. ఆ ఒక్క రోజు సంబరంతోనే సరిపెట్టింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అటకెక్కించింది. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే, ప్రయివేట్ భూమి కొనైనా సరే, ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడేసి ఎకరాల చొప్పున పంపిణీ...

Friday, March 3, 2017 - 19:58

మహబూబ్‌ నగర్‌/నిజామాబాద్‌ : మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లా ఏదైనా పరిస్థితి ఒక్కటే. మహబూబ్‌ నగర్‌ ఒకప్పుడు కెసిఆర్‌ ప్రాతినిథ్యం వహించిన జిల్లా. నిజామాబాద్‌ ఆయన కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. కానీ ఏం లాభం? మహబూబ్‌ నగర్‌ లో రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్‌ శంఖుఃస్థాపన చేసినా, నిజామాబాద్‌  ఏడాది కవిత శంఖుఃస్థాపన చేసినా అవే మాటలు. అవే కథలు. అవే వ్యధలు. డబుల్...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, January 15, 2017 - 18:32

మహబూబాబాద్ : పల్లెపల్లెను పలకరిస్తూ.. ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. 91వ రోజు తమ్మినేని పాదయాత్ర బృందం మందకొమురమ్మ నగర్‌లో పర్యటించింది. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరు పేదలు తలదాచుకునేందుకు కనీసం ఇళ్లు కూడా ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని...

Thursday, January 12, 2017 - 17:42

మహబూబాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారంపై సీపీఎం పార్టీ అలుపెరగకుండా పోరాటం చేస్తుండడం వల్లే... సీఎం కేసీఆర్‌కు సీపీఎం పార్టీ అంటే ఉలిక్కి పడుతున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్‌ అమలు చేయడం లేదన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర నేటితో 88వరోజుకు చేరుకుంది. 23వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి...

Thursday, January 12, 2017 - 17:39

మహబూబాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర నేటితో 88వరోజుకు చేరుకుంది. 23వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకుని.. 24వందల కిలో మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. చిల్కోడు, గొల్లచర్ల, బోరింగ్‌ తండా, కాంప్లాతండా, ఉయ్యాలవాడ, డోర్నకల్‌, బుద్దారంగేట్‌, గార్లలో పాదయాత్ర బృంద సభ్యులు పర్యటిస్తున్నారు. గ్రామాల్లో రియల్‌...

Thursday, January 12, 2017 - 10:27

మహబూబాబాద్ : భక్తరామదాసు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు, 8వేల 600 ఎకరాలు సాగులోకి వస్తాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. మహబూబాబాద్‌ జిల్లాలో తక్షణమే ఇంజనీరింగ్‌ కాలేజీతోపాటు... గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. 87వ రోజు...

Wednesday, January 11, 2017 - 13:45

మహబూబాబాద్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 87వ రోజు మహబూబాబాద్‌ జిల్లాలోని అబ్బాయిపాలెం వద్ద పాదయాత్ర 2300 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర బృందం అబ్బాయిపాలెం గ్రామం వద్ద 2300 కిలోమీటర్ల మైలురాయి వద్దకు చేరుకోగానే..గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని గాలివారిగూడెం...

Pages

Don't Miss