Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Wednesday, March 7, 2018 - 20:51

కర్నూలు : త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసం, సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు కలెక్టరేట్ వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. నగరంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ,ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. త్రిపురలో గెలిచిన తరువాత... బీజేపీ తన వాస్తవ నైజాన్ని కనబరుస్తోందని సీపీఎం నేతలు...

Saturday, February 24, 2018 - 11:35

జనగామ : జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో పెట్రోల్ దాడిలో గాయపడ్డ యాకయ్య మృతి చెందాడు. యాకయ్యతో పెళ్లి ఇష్టంలేక వధువు అరుణ హత్యకు కుట్రపన్ని యాకయ్యపై తనకు వరసకు సోదరుడైన బాలస్వామితో పెట్రోల్ దాడి చేయించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Wednesday, February 14, 2018 - 06:49

ఆదిలాబాద్‌ : జిల్లా మంచిర్యాల మండలంలోని లింగాపూర్‌, కన్నాల పరిధిలోని బుగ్గ శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు వైభంగా జరిగాయి. అతిపురాతమైన ఈ రెండు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణాలు శివనామ స్మరణతో మార్మోగాయి. భక్తులకు పలు స్వచ్చంధ సంస్థలు మంచినీరు, మజ్జిగ అందించాయి. మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయి.

తెలుగు...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Thursday, January 4, 2018 - 06:39

జనగామ : జిల్లాలో సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీ బాయి పూలే అంటరానితనాన్ని నివారిస్తూ, మహిళల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు కేజీబీవీ జిల్లా కన్వీనర్‌ కల్పనాదేవి. సావిత్రీబాయిపూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆమె కోరారు. జిల్లా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

Thursday, December 28, 2017 - 13:09

జనగాం : జిల్లాలో 10టివి న్యూ ఇయర్ 2018 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ శ్రీదేవిసేన ఆవిష్కరించారు. 10 టివి క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. 10టివి యాజమాన్యానికి, సిబ్బందికి, జనగామ జిల్లా ప్రజలకు శ్రీదేవిసేన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  

Pages

Don't Miss