TS EAMCET-2019 ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

Submitted on 27 May 2019
TS EAMCET-2019 Results Declared In June First Week

తెలంగాణలో EAMCET-2019 ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. సోమవారం (మే 27, 2019)న ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎంసెట్ ఫలితాలను వెల్లడించాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. ఈ ఏడాది మొదటిసారిగా గ్రేడింగ్‌ విధానంలోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. లాంగ్వేజ్‌లు మిగతా గ్రూపు సబ్జెక్టుల మార్కులను 25 శాతం వెయిటేజీగా తీసుకుని EAMCET ర్యాంకులను ఫైనల్ చేస్తారు.  

ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు ఆలస్యమైతే EAMCET ర్యాంకుల వెల్లడి కూడా ఆలస్యం అవుతుంది. EAMCET పరీక్షలు మే 3 నుంచి 9 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించి మే 3,4,6 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 1.31 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అలాగే మే 8,9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 68,550 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 

TS EAMCET
results
June First Week
2019

మరిన్ని వార్తలు