చూశాడంటే మీకుంటదీ : కార్నివాల్‌లో రాక్షస ట్రంప్

Submitted on 16 February 2019
trump pose in italy going to be viral


ట్రంప్ బాడీ లాంగ్వేజ్‌యే డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆయన ముఖంలోని హావభావాలు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఓ రూపంలో వైరల్‌గా మారుతుంటాయి. ట్రంప్ ఎక్స్‌ప్రెషన్‌లతో ఎన్నో రకాల వింత బొమ్మలను చూస్తూనే ఉన్నాం. అమెరికాలో జరిగితే పర్లేదు కానీ, పరాయి దేశాల్లోనూ ట్రంప్ గురించి పెద్ద ఎత్తులో చర్చించుకునేంత స్థాయిలో ఘటనలు జరిగితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే ఇటలీలో జరిగిన వియారెగ్గియో కార్నివాల్ వార్షికోత్సవాల్లో ట్రంప్ బొమ్మ భారీగా కనిపించి ప్రేక్షకులను అమితాశ్చర్యాలకు గురిచేసింది.

ఉత్సవాలకే హైలెట్‌గా నిలిచిన ట్రంప్ బొమ్మ.. నెటిజన్లు చూసి అది జోక్ అనుకుంటే పొరబాటే. వారు నిజంగా వార్‌హామ్మర్‌లాంటి గేమ్‌లలో ఉండే దేవదూతలా ట్రంప్ బొమ్మను చిత్రీకరించి ఊరేగించారు. ఆ బొమ్మ ఒక చేతిలో ట్విట్టర్ ఖడ్గం, రెండో చేతిలో రాబందులకు మాదిరి కాలి గిట్టలతో కనిపిస్తూ తల అటుఇటూ తిరుగుతుంటే నిజంగా వేటాడటానికే వచ్చినట్లుగా కనిపిస్తుంది. 

'దీనికి మాస్టర్ డ్రోన్ అని పేరు పెట్టి.. ట్రంప్ దేశాలను న్యూ క్లియర్ మిస్సైల్‌లకు బదులు ఎకానమీతో నాశనం చేయాలని భావిస్తున్నాడు. ఈ బొమ్మనే చెప్తోంది ట్రంప్ ట్విట్టర్‌ని ఏ విధంగా వాడుతున్నాడో.. ' అని దీని రూపకర్త చెప్పుకొచ్చాడు. నెట్టింల్లో వైరల్ అయిన ట్రంప్ అన్ని ఫొటోల కంటే దీనికే ఎక్కువ స్పందన వస్తుంది. మీరూ దీనిపై ఓ లుక్కేయండి.. 
 

donald trump
trump

మరిన్ని వార్తలు