Sky for ALL : @ 799లకే విమాన టికెట్

Submitted on 8 March 2019
Trujet Airways : Great Take Off Sale

టర్బో మేఘా ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రూ జెట్ జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 799లకే విమాన టికెట్ అందించనున్నట్లు వెల్లడించింది. గ్రేట్ టేకాఫ్ సెల్ పేరిట ఈ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ మాత్రం మార్చి 08వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు మాత్రమే ఉండనుంది. 
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ స్కీమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ప్రకటించిన ఈ ఆఫర్‌లో బుకింగ్ చేసుకున్న ప్యాసింజర్స్ మార్చి 08వ తేదీ నుండి అక్టోబర్ 26 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించే సౌకర్యం కల్పించిందని తెలుస్తోంది. గ్రేట్ టేకాఫ్ సేల్‌లో భాగంగా ప్రయాణికులకు మొత్తం లక్ష సీట్లను అందుబాటులో ఉంచినట్లు ట్రూజెట్‌ పేర్కొంది. 
Also Read : హనీ ఈజ్ ది బెస్ట్ : ట్రెండింగ్ లో ఎఫ్ 2 డిలీటెడ్ సీన్

Trujet Airways
Great Sale
Take Off Sale
Sky for ALL
great take off sale
UDAN scheme

మరిన్ని వార్తలు