డార్క్ వెబ్ లో True Caller డేటా : 14కోట్ల మంది యూజర్ల డేటా అమ్మేస్తున్నారు!

Submitted on 22 May 2019
Truecaller Personal data of millions of Indians available on dark web, company denies breach

మీరు True Caller యూజరా? తస్మాత్ జాగ్రత్త. మీ పర్సనల్ డేటా డేంజర్ లో ఉండొచ్చు. కోట్లాది మంది ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాను ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారట. ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు గురి కావడంతో యూజర్లను ఆందోళను గురిచేస్తోంది. డార్క్ వెబ్ చేతిలో మిలియన్ల మంది యూజర్లలో ఇండియన్స్  పర్సనల్ డేటా కూడా సేల్ చేస్తున్నట్టు ఓ రిపోర్ట్ తెలిపింది.

ఇంటర్నెట్ లో అక్రమ వస్తువుల నుంచి యూజర్ల పర్సనల్ డేటా వరకు సమాచారమంతా అందుబాటులో ఉన్నట్టు వెల్లడించింది. ఇన్విస్టిగేటివ్ రిపోర్ట్ ప్రకారం.. ట్రూ కాలర్ యూజర్ల పర్సనల్ డేటాలోని ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్ లు ప్రైవేట్ ఇంటర్నెట్ ఫారమ్స్, డార్క్ వెబ్ లో అమ్మకానికి అందుబాటులో ఉన్నట్టు వెల్లడించింది. 

లక్షల్లో డేటా సేల్.. 70 శాతం ఇండియన్స్ డేటా:
ట్రూ కాలర్ మొబైల్ యాప్ బేసిడ్ గ్లోబల్ యూజర్లు 140 మిలియన్లు (14 కోట్లు) మంది ఉండగా.. డార్క్ వెబ్ లో యూజర్లకు సంబంధించి వ్యక్తిగత సమాచారం అత్యధికంగా 25వేల యూరోలు (రూ.19.45 లక్షలు)గా సేల్ చేస్తున్నట్టు గుర్తించింది. వారిలో ఇండియన్ యూజర్లకు చెందిన పర్సనల్ డేటా 60 నుంచి 70 శాతం 2వేలు యూరోలు (రూ.1.55 లక్షలు) వరకు అమ్మకానికి ఉన్నట్టు నివేదిక తెలిపింది.  ట్రూ కాలర్ డేటా ఉల్లంఘనకు సంబంధించి ముందుగా స్వీడన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెలుగులోకి తెచ్చింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అనధికారంగా కాపీ చేస్తున్నట్టు గుర్తించింది.

డోంట్ ఫియర్.. యూజర్ల డేటా ఫుల్ సేఫ్ :
డేటా ఉల్లంఘనపై స్వీడన్ సంస్థ ఎన్నోరోజులుగా విచారణ చేస్తుండగా.. భారీ స్థాయిలో యూజర్ల పర్సనల్ డేటా ఉల్లంఘనకు గురైనట్టు గుర్తించింది. కానీ, ఇందులో ట్రూ కాలర్ డేటాకు చెందిన సమాచారం లేదని తెలిపింది. మరోవైపు.. డేటా ఉల్లంఘనపై స్పందించిన ట్రూ కాలర్ సంస్థ  తీవ్రంగా ఖండించింది. ట్రూ కాలర్ యూజర్ల డేటా ఎంతో సురక్షితమని, డేటా ఉల్లంఘనకు గురైనట్టుగా ఎలాంటి రికార్డు లేదని స్పష్టం చేసింది.

అంతేకాదు.. తమ డేటాబేస్ లోని ఫైనాన్షియల్ డేటాను కూడా చెక్ చేశామని ఎలాంటి ఉల్లంఘనకు అవకాశం లేదని తెలిపింది. ట్రూ కాలర్.. గ్లోబల్ కాంటాక్ట్ బుక్ సర్వీసు మాత్రమే కాకుండా.. ఇండియాలోని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (UPI) పేమెంట్ ఆప్షన్ అందిస్తోంది.

‘ట్రూ కాలర్ డేటాబేస్ పై జరిగింది దాడి కాదని గట్టిగా చెప్పగలం. ఎందుకుంటే.. యూజర్ల పర్సనల్ డేటా మొత్తం మా హై సెక్యూర్డ్ డేటాబేస్ సర్వర్లలో స్టోర్ చేశాం. యూజర్ల ప్రైవసీ పట్ల నైతికంగా సర్వీసులను ఎంతో సీరియస్ గా అందిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి డేటా ఉల్లంఘన ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు న్యూ ప్రొటోకాల్స్ ను అమలు చేస్తునే ఉంటాం’ అని ట్రూ కాలర్ ప్రతినిధి ఒకరు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

Truecaller data breach
Users Personal data
millions of Indians
dark web

మరిన్ని వార్తలు