సినిమా చూసిన కేటీఆర్ : చేనేత కళకు జీవం పోసింది

Submitted on 15 June 2019
TRS Working President KTR Appreciates Mallesham Movie Team

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మల్లేశం’ సినిమా చూశారు. ‘మల్లేశం’ సినిమాను చూసిన ఆయన చిత్ర దర్శకుడిని మెచ్చుకున్నారు. సామాన్యుడి జీవిత విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, అంతరించిపోతున్న చేనేత కళకు ఈ చిత్రం జీవం పోసిందని వ్యాఖ్యానించారు.

సినిమా చూసిన తర్వాత చేనేత వస్త్రాలు ధరించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తు చేశారు. ‘మల్లేశం’ సినిమాకు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని చిత్ర యూనిట్‌కు హామీ ఇచ్చారు. 

ఆలేరుకు చెందిన ఆసుయంత్రం సృష్టికర్త ‘పద్మశ్రీ’ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. స్టూడియో 99 బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను రాజ్ ఆర్ రూపొందించారు. శ్రీ అధికారి రాజ్ ఆర్ నిర్మాతలు. మల్లేశం పాత్రలో ప్రియదర్శన్ నటించగా, అతని తల్లిగా ఝాన్సీ, భార్యగా అనన్య నటించారు. 

TRS Working President
KTR
Appreciates
Mallesham Movie Team

మరిన్ని వార్తలు