జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ మద్దతు : కేటీఆర్

Submitted on 19 June 2019
trs party support for one nation one election

ఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో పార్లమెంటరీ లైబ్రరీ హాలులో  బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది.  4 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న 24 పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్  విలేకరులతో మాట్లాడుతూ....ఈ స‌మావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాల‌ను ప్ర‌ధాని తెలుసుకున్నారని, ప్ర‌ధాని మోడి అభిప్రాయాల‌ను సైతం నిర్మోహ‌మాటంగా మాకు తెలిపారని చెప్పారు. రాష్ట్రాల‌ను బలోపేతం చేస్తూ, ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ బ‌లోపేతం చేస్తేనే దేశం బ‌ల‌పండుతుంద‌ని చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు.  

జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ అవసరం అయితే టీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందని కేటీఆర్ అన్నారు. "ఎన్నికలలో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే పరిమిత కాలవ్యవధిలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మంచిదే. జమిలి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్ లు ప్రవేశ పెట్టడం సులభతరమవుతుంది. జమిలి ఎన్నికలతో ఐదేళ్లపాటు ప్రభుత్వ ఫలాలను ప్రజలు పొందే అవకాశం ఉంటుంది.విడతల వారిగా ఎన్నికలు జరగడంతో పాలన కుంటుపడుతుంది. ఎన్నికల ఖర్చు పెరుగుతుంది. సాధ‌క బాధ‌కాలు ఎన్ని ఉన్నా జ‌మిలి ఎన్నిక‌లు ఆహ్వానించ‌ద‌గ్గ నిర్ణ‌యం" అని టీఆర్ఎస్ తరపున తెలిపాం అని కేటీఆర్ వివరించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలనివ ప్రధానిని కోరామని,  వెనుకబడిన జిల్లాల జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా ఉందని తెలిపామన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా అనుసరించాల్సిన పద్దతి ఉండాలని కోరినట్లు  కేటీఆర్  చెప్పారు. 

స్వాతంత్యం వ‌చ్చి 75 వసంతంలోకి  అడుగిడుతున్న నేప‌థ్యంలో నయా భార‌త్ నిర్మాణానికి ఏం చేస్తే బాగుంటుంద‌ని  ప్ర‌ధాని కోరగా, టీఆర్ ఎస్ పార్టీ అభిప్రాయాన్ని ప్రధానికి తెలిపామన్నారు. వ్య‌వ‌సాయం, వైద్యం, విద్య‌ను రాష్ట్రాల‌కు బ‌ద‌లాయించాల‌ని  వివరించినట్లు ఆయన చెప్పారు. మ‌హాత్మ‌గాంధీ  150వ‌ జ‌యంతి ఉత్స‌వాలు జ‌ర‌ప‌లానే కేంద్ర నిర్ణ‌యాన్ని ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌యోధ్యతో ప్ర‌తి రాష్ట్రంలో టార్గెట్ గా 150 స్కూల్స్, 150 గ్రామాలు, 150 ఆసుప‌త్రుల‌ను ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో ఆద‌ర్శ‌వంతంగా అభివృద్ధి చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌ధాని ముందుంచాం, వాటిని పరిశీలిస్తామని అన్నారు.

Delhi
trs party
One Nation One Election
KTR
All Party Meet
 


మరిన్ని వార్తలు