’కాళేశ్వరం’కు నిధులు దక్కలేదు : ఎంపీ జితేందర్ రెడ్డి 

Submitted on 11 February 2019
trs mp Jitender Reddy spoke in the Lok Sabha

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో నిధులు దక్కలేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మిస్తున్న డబ్లింగ్, బ్రిడ్జ్ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వేకు నిధులు కేటాయించడాన్ని జితేందర్ రెడ్డి స్వాగతించారు. ఫిభ్రవరి 11 సోమవారం రోజున జితేందర్ రెడ్డి లోక్ సభలో మాట్లాడారు. 

వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నదని, ఈ వర్సిటీ కోసం కేటాయింపులు తగ్గించారని పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారని గుర్తుచేశారు.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు రెండు పాఠాలు నేర్పాయన్నారు. రైతులను విస్మరించరాదు అన్న విషయాన్ని తేల్చాయని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేయాలన్నది కూడా అత్యవసరమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అద్బుతమైందని, తమ పార్టీ మళ్లీ విజయకేతనం ఎగురవేయడంలో ఆ పథకం కీలకంగా నిలిచిందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కన్నా ఎక్కువగా రైతు బంధు పథకం కింద రైతులకు పంట సాయం చేస్తున్నామని తెలిపారు. 

దేశంలో టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయటాన్ని సమర్ధిస్తారా?

Choices

మరిన్ని వార్తలు