కేటీఆర్ ఎన్నికల ఖర్చు రూ.7.75 లక్షలు

Submitted on 22 February 2019
 కేటీఆర్ ఎన్నికల ఖర్చు రూ.7.75 లక్షలు

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చులో అతి తక్కువ వ్యయం చేసిన నేతగా  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఎన్నికల్లో కేటీఆర్ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ పార్టీల అభ్యర్థులు ప్రకటించిన ఎన్నికల ఖర్చుల్లో కేటీఆర్‌ కేవలం రూ.7 లక్షల 75 వేలు మాత్రమే ఖర్చు పెట్టినట్లు ఈసీ తెలిపింది.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కో అభ్యర్థి రూ.28 లక్షల వరకు ఖర్చు  చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆయా అభ్యర్థుల ఖర్చు పెట్టిన వివరాలు చూద్దాం..
 

ఎన్నికల ఖర్చును ప్రకటించిన నేతలు  12 మంది 
కేటీఆర్ (టీఆర్ఎస్) రూ.7 లక్షల 75 వేలు
శేరిలింగంపల్లి (టీఆర్ఎస్) అరికెపూడి గాంధీ రూ.23.92 లక్షలు  
తలసాని శ్రీనివాస యాదవ్‌ (టీఆర్ఎస్)రూ.23.31 లక్షలు 
పద్మావతి (కాంగ్రెస్) రూ.20.58 లక్షలు
నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్))రూ.20.24 లక్షలు
అక్బరుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) రూ.12.97 లక్షలు


ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థీ తమ ఎన్నికల వ్యయాన్ని ప్రకటించాల్సి ఉండగా..ఇంతవరకు తమకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీ నాయకులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఖర్చు భారీ ఎత్తునే ఖర్చయ్యింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు ప్రత్యేక విమానాలను కూడా వినియోగించారు. ఈ ఖర్చును ప్రచారం చేసిన అభ్యర్థుల ఖర్చులో కలపాల్సి ఉంటుందని ఈసీ అధికారులు తెలిపారు. 

Telangana
Assembly Election
MLA Candidates
Cost
Easy
Details
KTR

మరిన్ని వార్తలు