దిగ్విజయ్ ఓటమితో...స్వామి వైరాగ్యానంద సజీవ సమాధి!

Submitted on 15 June 2019
Trolled after Digvijaya Singh’s defeat, seer seeks go-ahead for immolation

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే దిగ్విజయ్ సింగ్ గెలవాలని ఆయన తరఫున స్వామి వైరాగ్యానంద అనే సాధువు పూజలు, యాగాలు నిర్వహించారు. ఎన్నికల్లో దిగ్విజయ్‌ కచ్చితంగా గెలుస్తారని,లేకుంటే తనకు తాను సజీవ సమాధి చేసుకుంటానని హామీ ఇచ్చారు.

అయితే మోడీ హవాతో దేశవ్యాప్తంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. భోపాల్‌ లోనూ జెండా ఎగురవేసింది. భోపాల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సాధ్వీ ప్రగ్యా సింగ్ ఘన విజయం సాధించారు. దీంతో ఇచ్చిన మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆ సాధువును ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో  చేసేది లేక ఆ స్వామిజీ లాయర్‌ సాయంతో భోపాల్‌ కలెక్టర్ ని సంప్రదించారు. ఇచ్చిన మాట ప్రకారం తనని తాను సమాధి చేసుకోవడానికి అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నారు. అందుకు ఆదివారం మధ్యాహ్నం 2.11గంటలకు ముహూర్తం నిర్ణయించినట్లు లేఖలో తెలిపారు.

ప్రస్తుతం నేను కమాఖ్యధామ్‌లో నివాసముంటున్నాను. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం.. జూన్‌-16,2019 మధ్యాహ్నం 2.11గంటలకు సమాధి చేసుకోవడానికి నన్ను అనుమతించండి. అందుకుగాను స్థలాన్ని కేటాయించి నా మత సాంప్రదాయాల్ని గౌరవించేలా నాకు అధికారులు సహకరిస్తారని విశ్వసిస్తున్నాను అని వైరాగ్యనంద్‌ లేఖలో తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తరుణ్‌ కుమార్‌ పిఠోడే అందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అలాగే దరఖాస్తుదారుడు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు.దిగ్విజయ్ ఓటమి సాధువు చావుకొచ్చిందని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్నారు.

DIGVIZAY SINGH
bhopal
madhyapradesh
seer
vairagyanandha
swami
immolation
self
Collector
Letter
permission

మరిన్ని వార్తలు