మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Submitted on 12 February 2019
Tripura minister groping woman colleague on stage with PM Modi goes viral

పేరుకే ఆయన మంత్రి.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన చేసేది మాత్రం పాడుపనులు.. తోటి మహిళా మంత్రిని చూడకుండా ఆమె పట్ల త్రిపుర మినిస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేజీపై అందరూ చూస్తుండగానే ఈ పాడుపనికి పాల్పడ్డాడు. సాక్ష్యాతూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలోనే మగ మంత్రి పాడు పని చేస్తూ కెమెరాకు చిక్కాడు. త్రిపురలో జరిగిన ఈ ఘటన రాజకీయ వివాదానికి తెర లేపింది. 

అసలేం జరిగిందంటే.. త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం విప్లవ్ దేవ్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ స్టేజీ పైకి వచ్చి ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తున్నారు. అదే స్టేజీపై రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్ కాంతి దేవ్ అక్కడే ఉన్నారు. ఆయన పక్కనే మహిళా మంత్రి శాంటన చక్మ కూడా నిలబడ్డారు. మంత్రిగారికి పాడుబుద్ధి పుట్టినట్టుంది.. వెంటనే.. మహిళా మంత్రిని వెనుక నుంచి తన చేతితో అసభ్యంగా తాకాడు. అది గమనించిన మహిళా మంత్రి వెంటనే ఆయన చేతిని వెనక్కి నెట్టేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 


ఈ వీడియోపై స్పందించిన ప్రతిపక్ష నేతలు మహిళ మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మనోజ్ దేవ్ ను వెంటనే మంత్రిపదవి నుంచి తొలగించాలని, ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రి మనోజ్‌ను మీడియా ప్రశ్నించగా స్పందించకుండా మాట దాటేసి వెళ్లిపోయారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. మహిళా మంత్రి.. మనోజ్ దేవ్ పై ఫిర్యాదు చేయలేదు. మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసేింది. 


Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: ఉలిక్కిపడిన హైదరాబాద్ : కరెంట్ పోల్ పట్టుకుని.. అలానే బాలుడు మృతి 

Also Read: రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ

Monoj Kanti Deb
Narendra Modi
Rally
ministerial colleague

మరిన్ని వార్తలు