ఇంటర్ ఫలితాలపై వేసిన పిటిషన్ కొట్టివేత

Submitted on 19 June 2019
trial over petition on intermediate result in high court

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. పరిహారం చెల్లించాలని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. తప్పులకు బాధ్యులపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. శాఖాపరమైన విచారణ జరిపి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. 

ఫలితాల్లో చిన్న చిన్న తప్పులే జరిగాయని కోర్టు అభిప్రాయపడింది. రీవెరిఫికేషన్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 0.16 శాతమే ఉత్తీర్ణులయ్యారని వెల్లడించింది. ఇంటర్ ఫలితాలపై వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగిన విషయం తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని  కొంతమంది, మార్కులు తక్కువగా వచ్చాచని మరి కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈక్రమంలోనే ఇంటర్ ఫలితాలపై పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. 
 

Trial
over
Petition
Intermediate Results
High Court
Hyderabad


మరిన్ని వార్తలు