11నెలల పాప కాళ్లకు ఫ్రాక్చర్ : ఫస్ట్.. బొమ్మకు వైద్యం చేసిన డాక్టర్లు

Submitted on 30 August 2019
To Treat 11-Month-Old's Fracture, Doctors First Had To Plaster Her Doll

ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 11 నెలల పాప కాలికి గాయం కావడంతో లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరింది. కానీ, చికిత్స తీసుకునేందుకు పాప మారం చేసింది. తల్లిదండ్రులు, వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతసేపటికి పాప చికిత్సకు సహకరించలేదు. గుక్కపట్టి ఒకటే ఏడుస్తోంది. చివరికి తల్లిదండ్రుల సలహా మేరకు వైద్యులు ముందుగా పాప బొమ్మకు వైద్యం చేశారు. ఆ తర్వాతే పాప తన కాలికి వైద్యం చేసేందుకు సహకరించింది. ఢిల్లీకి చెందిన జిక్రా మాలిక్ (11) అనే చిన్నారి ఇంట్లో మంచంపై ఆడుకుంటుండగా ఆగస్టు 17న కింద పడిపోయింది. ఈ ఘటనలో పాప కాలు విరిగింది. తల్లిదండ్రులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.

అప్పటినుంచి చిన్నారి ఏడుస్తోంది. వైద్యులు చికిత్స చేసేందుకు ప్రయత్నించినా ఏడుపు ఆపలేదు. చివరికి పాప ఆడుకునే బొమ్మను తీసుకురావడంతో ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది. అప్పటికి వైద్యానికి నిరాకరించింది. వైద్యులు తెలివిగా ఆలోచించి ముందు పాప బొమ్మ కాలికి వైద్యం చేశారు. బొమ్మ కాళ్లకు ప్లాస్టర్ అంటించారు. అది చూసిన చిన్నారి సంతోషంగా తన కాళ్లకు కూడా వైద్యం చేయించుకుంది. చిన్నారితో పాటు బొమ్మ కలిసి ఒకే బెడ్ పై ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫొటోలో పాప రెండు కాళ్లను స్రెచ్చర్ కు వేలాడదీయగా... పాలపీక నోట్లో పెట్టుకుని పాలు తాగుతోంది. పక్కనే బొమ్మ కాళ్లను కూడా స్రెచ్చర్ కు వేలాడిదీసి ఉన్నాయి. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ బ్లాకులో 16 బెడ్ నెంబర్ పై పడుకున్న ఈ చిన్నారి.. బొమ్మ ఇప్పుడు ఫేమస్ అయిపోయారు. ఇప్పుడప్పుడే కోలుకుంటున్న పాప మరోవారంలో పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్చి కానుంది. 

11 Month Old infant
Leg Fracture
Doctors
Doll
Treatment
 Lok Nayak Hospital
Zikra Malik 

మరిన్ని వార్తలు