అది ట్రావెల్ బ్యాగ్ కాదు.. చిన్నారి

Submitted on 9 January 2019
Travel Luggage bag : Father's little boy in America Washington Duel Airport

వాషింగ్టన్ : చిన్నారి పాపని తండ్రే  లగేజీ బ్యాగ్ ను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లాడు. న్యూ ఇయర్ రోజున జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలోని వాషింగ్టన్ డ్యూల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కెమెరాలకు చిక్కిన ఈ ఘటన కలకలం రేపుతోంది. కుమార్తె హూడీని.. అతని తండ్రి లగేజీ బ్యాగ్ ఈడ్చుకెళ్లినట్లు తీసుకెళ్లారు. చిన్నారి ఓ చేయిపట్టుకుని లాక్కెళ్లటం స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి బలవంతంగా ఈడ్చుకెళుతున్నా.. ఆ చిన్నారి అరవకపోవటంతో ఎవరూ మొదట గుర్తించలేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటం.. అది తండ్రి మొబైల్ కే రావటంతో స్పందించాల్సి వచ్చింది. హడావిడిగా వెళ్లాల్సి ఉందని.. అయితే తన కూతురు.. తన వెనక నడవటం ఇబ్బందిగా అనిపించిందని.. అందుకే అలా తీసుకెళ్లటం జరిగిందంటూ వివరణ ఇచ్చారు. ఈ వివరణ నెటిజన్లను ఏ మాత్రం కన్విన్స్ చేయలేకపోయింది. మీరు చెబుతున్న మాటలు నమ్మసఖ్యంగా లేవు అంటున్నారు.

america
Washington
Duel Airport
Luggage bag
Video
viral

మరిన్ని వార్తలు