చైనీస్ మంజా : అయ్యో రామచిలుక.. ప్రాణం తీశారే!

Submitted on 16 January 2019
Tragic photo of dead parrot at Kite Festival leaves internet heartbroken

మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కైట్ ఫెస్టివల్ లో అందరూ ఆనందంగా గడిపేస్తారు. సంక్రాంతి పండుగ అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చే సంప్రదాయ ఆట.. పతంగుల పండుగ.  పతంగులు ఎగురవేయడం, స్వీట్లు, రుచికరమైన పిండివంటలు తయారు చేయడం, భోగి మంటల్లో వెచ్చగా సేదతీరుతూ కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఎక్కడ చూసిన దుకాణాల్లో పతంగులే కనిపిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు అందరూ గాల్లోకి పతంగులు ఎగురవేసి సంబరపడుతుంటారు. కానీ, ఈ పతంగుల కారణంగా గాల్లో స్వేచ్ఛగా విహరించే పక్షులకు హాని కలిగిస్తున్నాయనే విషయం మరిచిపోతుంటారు. పతంగుల్లో వాడే చైనీస్ మంజా దారాల కారణంగా పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఫొటో. చెట్టు మీద వాలిన రామచిలుక పతంగి దారానికి చిక్కడంతో ఊపిరాడక మృతిచెందింది. చెట్టు కొమ్మకు చిక్కిన మంజా దారానికి వేలాడుతూ ఉన్న రామచిలుక ఫొటోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

చైనీస్ మంజా దారానికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన రామచిలుక ఎంత విలవిలలాడి ఉంటుందోనని పక్షుల ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను చూసిన వారంతా అయ్యో పాపం.. రామచిలుక ప్రాణాలు అన్యాయంగా బలిగొన్నారే అంటూ మండిపడుతున్నారు.  రాష్ట్రంలో చైనా మంజాలను నిషేధించినప్పటికీ కొన్నిచోట్ల అవి కనిపిస్తున్నాయి. మరోవైపు చైనీస్ మంజా దారాలను పతంగులు ఎగరవేయడానికి వాడొద్దని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. ఈ చైనీస్ మంజా దారాలు జంతువులు, పక్షులకు ఎంతో ప్రమాదకరమని దయచేసి వీటిని వాడరాదని అభ్యర్థిస్తున్నారు.  

Tragic photo
parrot
Kite Festival
internet heartbroken  

మరిన్ని వార్తలు