రైతన్నా మజాకా : JCB అక్కర్లా ట్రాక్టర్ ఉంటే చాలు..ఎత్తి పోసేస్తా..

Submitted on 25 May 2019
Tractor is a farmer using JCB

రైతు అంటే పొలం దున్ని ఆహారాన్ని పండించేవాడు మాత్రమే కాదు. సమయస్ఫూర్తితో పంటకు ఏ సమయానికి ఏది అవసరమో పూర్తి అవగాహన కలిగినవాడు రైతన్న. పొలానికి చీడపీడలు వస్తే ఏ మందు కొట్టాలో అతనికి తెలుసు. దానికి పెద్ద పెద్ద చదువులు అక్కరలేదంటాడు. ఎందుకంటే అవసరమే అన్ని నేర్పిస్తుందనేది రైతు సిద్ధాంతం. ఇదిగో దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రైతు.

గుంతలు తవ్వడానికి, మట్టిని ఎత్తడానికి..ఎత్తిన మట్టిని ఎక్కువ మొత్తంలో మరో చోట పొయ్యటానికి JCB ఉపయోగిస్తుంటారు.  JCB తో పని చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఈ రైతు తన ట్రాక్టర్ నే  JCB గా వాడేస్తున్నాడు. 

ట్రాక్టర్ ముందు భాగాన్ని మట్టి ఎత్తిపోసేలా ఇనుప మంచంలా తయారు చేశాడు. ఏంచక్కా JCB చేసే పనినే తన ట్రాక్టర్తో చేసేస్తున్నాడు. ఈ ట్రాక్టర్ కాదు కాదు..ట్రాక్టర్ JCB తో ఈ రైతన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tractor
Farmer
using
JCB
iron cot

మరిన్ని వార్తలు