తెలుగు సినిమా 2019: టీఆర్‌పీల్లో టాప్ సినిమాలు ఇవే!

Submitted on 16 December 2019
Top 10 Tollywood Movies as Per TRP Ratings in 2019

తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. బాహుబలికి ముందు శాటిలైట్ రైట్స్ అంటే పెద్దగా ఎవరికి తెలిసేవి కాదు. ఏదో అమ్మామంటే అమ్మాం అన్నట్లుగా ఓ డిస్ట్రిబ్యూటర్‌కి అమ్మినట్లుగా సినిమాని అమ్మేవాళ్లు కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమాల శాటిలైట్ హక్కులు భారీ రేట్లకు అమ్మడుపోతున్నాయి.

ఈ క్రమంలోనే 2019లో సినిమాలను భారీ రేట్లకు అమ్ముకున్నారు నిర్మాతలు అలా 2019 సంవత్సరంలో అమ్ముకున్న సినిమాలు.. బుల్లితెర ప్రేక్షకులనూ అలరించాయి. 2019 సంవత్సరానికి టాప్ టీఆర్‌పీ రేటింగ్‌లు సాధించిన సినిమాల లిస్ట్ చూస్తే..

F2(Fun & Frustration) ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను బుల్లి తెరపై కూడా అలరించారు ప్రేక్షకులు ఈ సినిమాకు 17.2 టీఆర్‌పీ రేటింగ్ రాగా.. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నీరాజనం పలికారు బుల్లితెర ప్రేక్షకులు.

ఇక రెండో స్థానంలో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి ఇస్మార్ట్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' నిలిచింది. ఈ సినిమాకు 16.63 టీఆర్‌పీ రేటింగ్ లభించింది.  రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూడో స్థానంలో 'కాంచన 3' నిలిచింది. ముని సినిమా సీక్వెల్‌గా రాఘవ లారెన్స్ చేసిన ఈ సినిమాకు 13.10 టీఆర్‌పీ రేటింగ్ లభించింది.

తర్వాతి స్థానాల్లో వరుసగా.. మహేష్ బాబు- మహర్షి (9.2), సమంత- ఓ బేబీ (9), నాని- జెర్సీ (8.8), నాగచైతన్య- మజిలీ (7.9), రాంచరణ్- వినయ విధేయ రామ (7.90), కాజల్- సీత (7.53), కళ్యాణ్ రామ్- 118 మూవీ (6.33) టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయి.

top 10
Tollywood Movies
TRP Ratings
2019

మరిన్ని వార్తలు