వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్‌కు టాలీవుడ్ స్టార్ హీరోలు

Submitted on 16 May 2019
Tollywood Celebrities at World Cup

ప్రతిష్టాత్మక క్రికెట్ ప్రపంచ కప్ చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. 10దేశాల మధ్య ఎంతో ఆసక్తికరంగా జరగనున్న ప్రపంచకప్ టోర్నమెంట్‌ను లైవ్‌లో చూసేందుకు విక్టరీ వెంక‌టేష్‌, సుపర్ స్టార్ మ‌హేష్ బాబు, నిర్మాత సురేష్ బాబు వారితోపాటు డా.కామినేని శ్రీనివాస్‌, ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, చంద్ర‌కుమార్‌ల‌ు కూడా వెళ్తున్నారు. వీరందరూ ఛాముండేశ్వర్ నాధ్ నేతృత్వంలో ఇంగ్లాండ్‌కు వెళ్తున్నారు.

వరల్డ్ కప్ టోర్నమెంట్ మే 30 నుండి ఇంగ్లండ్‌లో మొద‌లు కానుండగా జూన్ 9, జూన్ 13, జూన్ 16 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్ దేశాల‌తో ఇండియా మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఆ మ్యాచ్‌లను చూసేందుకు వీళ్లు ఇంగ్లాండ్ వెళ్లాలని, ప్లాన్ చేసుకున్నార‌ట‌. వారం రోజులపాటు వీరందరూ అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఛాముండేశ్వరినాధ్ వెల్లడించారు.

వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంకటేష్ ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా కూడా వెళ్తుండడం గమనిస్తూనే ఉంటాం. అలాగే మహేష్ బాబు కూడా క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పిన సంధర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరు ఇంగ్లాండ్‌కు వెళ్తున్నారు. ఈ టూర్ పూర్తైన త‌ర్వాత మ‌హేష్ బాబు అనీల్ రావిపూడితో సినిమా చేయ‌నున్నాడు. మరోవైపు వెంక‌టేష్ 'వెంకీ మామ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Tollywood Celebrities
World Cup
United Kingdom
india

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు