మేము సైతం : తెలంగాణ బంద్‌కు టీఎన్జీవో మద్దతు

Submitted on 17 October 2019
TNGO support for TSRTC workers' strike

ఆర్టీసీ కార్మికులు చేపడుతన్న సమ్మె రోజు రోజుకు ఉధృతమౌతోంది. అక్టోబర్ 17వ తేదీకి 13వ రోజుకు చేరుకుంది. సీఎం కేసీఆర్ పలు దఫాలుగా సమీక్షలు జరుపుతున్నారు. హైకోర్టు అక్టోబర్ 18వ తేదీన దీనిపై విచారణ చేపట్టనుండడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు రాష్ట్ర సీఎస్‌ను కలిశారు. తామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టిఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డితో 10tv మాట్లాడింది. 

అక్టోబర్ 19వ తేదీన కార్మికులు ఇచ్చిన బంద్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతోందన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల అనంతరం మరలా పిలిచి సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారని వెల్లడించారు. కార్మికుల సమ్మెను ఆయన దృష్టికి తీసుకరావడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు, ఆర్టీసీ జేఏసీ నాయకత్వానికి మద్దతు పలకడం జరిగిందని గుర్తు చేశారు. విధుల నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారికి జీతాలు ఇవ్వలేదని, హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం తగు విధంగా చర్యలు తీసుకొంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. 

మరోవైపు సమ్మెపై గవర్నర్ ఆరా తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ సమీక్షలో మంత్రి పువ్వాడ పాల్గొనడంతో రవాణా శాఖ కార్యదర్శిని గవర్నర్ కార్యలయానికి వెళ్లారు. కార్మికుల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలను ఆయన వివరించారు. అక్టోబర్ 18వ తేదీన గవర్నర్‌తో మంత్రి పువ్వాడ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 
Read More : సమస్యలు పరిష్కరించాలి : సీఎస్‌ ఎస్‌కే జోషిని కలిసిన టి. ఉద్యోగుల జేఏసీ

TNGO
Support
TSRTC workers' strike

మరిన్ని వార్తలు