కూతుర్ని సజీవ దహనం చేసి..తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి

Submitted on 20 November 2019
TN woman sets daughter on fire allegedly over relationship with Dalit youth

తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందంనే కోపంతో కన్నతల్లి కూతుర్ని కడతేర్చింది. కూతుర్ని కిరసనాయిల్ పోసి తగల బెట్టి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి  వెళితే... వాజ్మంగళం అనే గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్‌ దంపతులకు జనని(17) అనే కుమార్తె ఉంది. కన్నన్‌ కార్పెంటర్‌గా పనిచేస్తుండగా.. ఉమా రోజూవారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో మైనర్ అయిన జనని..అదే గ్రామానికే చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జనని.. వచ్చే నెలలో మేజర్‌ కానుండటంతో అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమె ప్రేమను తిరిస్కరించి మందలించారు. 

తల్లితండ్రులు తన ప్రేమను తిరస్కరించటంతో మంగళవారం, నవంబర్ 19న ప్రియుడితో కలిసి పారిపోయేందుకు జనని సిధ్దపడింది. అయితే ఈ విషయం గమనించిన జనని తల్లి ఉమామహేశ్వరి కూతురితో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన ఉమ.. కూతురిపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జనని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఇక ఉమ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూతురి హత్యలో తండ్రి కన్నన్‌కు కూడా భాగం ఉందా ?  అనే కోణంలో  పోలీసులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. 

tamilnadu
Love
bc
Dalith
Sucide

మరిన్ని వార్తలు