రాజీవ్ హంతకుల రిలీజ్ కు కట్టుబడి ఉన్నాం...సీఎం పళనిస్వామి

Submitted on 20 May 2019
TN govt committed to release of Rajiv case convicts: CM Palaniswami

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తమిళనాడు సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. వారి విడుదలను ఆమోదిస్తూ మంత్రి వర్గం చేసిన తీర్మానంపై రాష్ట్ర గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 

కొంతకాలంగా రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషులను హంతకులను విడుదల చేయాల్సిందిగా ప్రతిపక్షాల నుంచి, తమిళనాడులోని ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.గతంలో రాజీవ్‌ హత్యకు కేసు దోషులను విడుదల చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ ను సుప్రీం తోసిపుచ్చింది. దీంతో 2018సెప్టెంబర్‌లో రాజీవ్‌ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగుర్ని విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం తీర్మానిస్తూ గవర్నర్‌  కు నివేదిక పంపింది. దీనిపై పళనిస్వామి మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కేబినెట్‌ లో తీర్మానాన్ని ఆమోదించాం.ఈ విషయంలో పూర్తిగా నిర్ణయాధికారం గవర్నర్‌ చేతుల్లో ఉందని సీఎం తెలిపారు.

rajeev gandhi
tamilnadu
Govt
assasination
convits
release
commited
palaniswami
Governor

మరిన్ని వార్తలు