
కోల్ కత్తా: తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీగారు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ తో కలిసి స్టెప్పులేశారు. కొల్ కత్తా లో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హీరోయిన్ రవీనా టాండన్ హజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేదిక పై ఉన్నఎంపీ సౌగతారాయ్ ను తనతో స్టెప్పులు వేయాల్సిందిగా రవీనా కోరారు. 1994 లోవిడుదలైన "మోహ్రా" సినిమాలోని 'తూ ఛీజ్ బడీ హై మస్త్..మస్త్" పాటకు రవీనా స్టేప్పులేస్తుంటే ఆమెకు అనుగుణంగా కాలు కదపుతూ ఎంపీగారు స్టెప్పులేసి జనాల్ని హుషారెక్కించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురివి ఆకర్షిస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని డుమ్ డుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌగతారాయ్ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో పట్టణాభివధ్ధిశాఖామంత్రిగా పనిచేశారు.