దయచేసి చెట్లను నరికివేయండి..కొచ్చి వాసుల గగ్గోలు

Submitted on 15 July 2019
Tired of bird poop on their cars, Kochi residents think cutting trees is the solution

సాధారణంగా ఎక్కడైనా చెట్లను నరికేయవద్దు,వీలైనన్ని ఎక్కువ పెంచండి అన్న స్లోగన్స్ మనం వింటుంటాం. అయితే కేరళలోని కొచ్చి నగర వాసులు మాత్రం చెట్లను నరికేయండి అని కంప్లెయింట్ లు చేస్తున్నారు. అయితే ఎందుకు వాళ్లు చెట్లను నరికివేయమంటున్నారో తెలుసా?. 
Also Read : ఖమ్మం కార్పొరేషన్‌లో తిక్క టాక్ : Tik Tokతో ఉద్యోగులు బిజీ బిజీ

కచ్చిలోని అలువా రైల్వేస్టేషన్‌లోని పార్కింగ్ ఏరియాలో భారీగా చెట్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు రైళ్లల్లో వెళ్లే కొచ్చి వాసులు అక్కడ తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. అయితే చెట్లపై భారీగా పక్షులు ఉండడంతో అవి వేసే రెట్టలు వాహనాలపై పడుతున్నాయి. దీంతో ఆ వాహనాలను శుభ్రం చేసేందుకు ప్రతి రోజు 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటుంది.

వాహనాలపై పక్షుల రెట్టలు వేస్తుండడంతో వాహనాలు పాడవుతున్నాయని,దీంతో చెట్లను నరికేయాలని రైల్వే అధికారులకు కొచ్చి వాసులు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన రైల్వే అధికారులు...చెట్లను నరికేయడం వల్ల పర్యావరణానికి ప్రమాదం కలుగుతుందంటున్నారు.
Also Read : ఎలక్ట్రికల్ కార్ల వియోగంలో యూపీ టాప్

kochi
residents
CUTTING TREES
SOLUTION
BIRD POOP
Cars

మరిన్ని వార్తలు