నిర్లక్ష్యం ఖరీదు : పంట కాల్వలోకి దూసుకెళ్లిన బైక్.. ఐదుగురిలో ముగ్గురు మృతి

Submitted on 23 July 2019
three killed at road accident in east godavari

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గుడిమెళ్లంకలో విషాదం చోటుచేసుకుంది. పల్సర్ బైక్ పంట కాలువలోకి దూసుకుపోయింది. బైక్ పై వెళ్తున్న ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పిల్లలు ఒక మహిళ ఉన్నారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. 

పశ్చిమగోదావరి జిల్లా కాజా ప్రాంతానికి చెందిన ఐదుగురు పల్సర్ బైక్ పై తూర్పుగోదావరి జిల్లా రామరాజులంక వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. భార్గవి అనే చిన్నారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చిన్నారిని నాటు వైద్యం కోసం తీసుకెళ్తున్నారు. మార్గంమధ్యలో మలికిపురం మండలం గుడిమెళ్లంక దగ్గర మంగళవారం (జులై 23, 2019) పంట కాల్వలోకి బైక్ దూసుకెళ్లింది. ఇద్దరు చిన్నారులతోపాటు మహిళ మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తి, మరొక మహిళ సురక్షితంగా బయటపడ్డారు. 

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు మహిళతోపాటు చిన్నారి మృతదేహాలను వెలికి తీశారు. మరో చిన్నారి మృత దేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాధారణంగా బైక్ పై ముగ్గురు వెళ్లొచ్చు. కానీ ఐదుగురు వెళ్తున్నారు. దీంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Three
killed
road accident
East Godavari
byke
five members
travel

మరిన్ని వార్తలు