బ్రేక్ లేదు కదా : శ్రీవారి దర్శనం త్వరగానే అవుతుంది

Submitted on 19 July 2019
Thirumala lord Venkateswara's vision for ordinary devotees is easy

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే సామాన్యులకు ఎన్నో కష్టాలు. వీఐపీలు అయితే అలా వెళ్లి ఇలా వచ్చేశారు. తీరిగ్గా స్వామి వారిని దర్శించుకుంటారు. సామాన్యులు మాత్రం ఎంత కష్టమైనా వెంకన్నను రెప్పపాటు దర్శనానికే కష్టాన్నంతా మర్చిపోతారు. ఇక నుంచి ఇలాంటి సిట్యువేషన్ ఉండదు అంటోంది టీటీడీ.  సామాన్య భక్తులు ఇబ్బంది లేకుండా గోవిందుడిని కళ్లారా చూడొచ్చు అంటోంది.

వీఐపీ బ్రేక్ దర్శనం రద్దుతో.. మంచి రెస్పాన్స్ వస్తోంది. దీని వల్ల జులై 17 గురువారం ఒక్క రోజే.. అదనంగా 5వేల మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రేక్ దర్శనం కింద 2వేల 904 మంది టిక్కెట్లు ఇచ్చింది. వీరిలో 49మంది ప్రోటోకాల్ ప్రముఖులు. వీరందరినీ ఆలయానికి ముందుగా..తీసుకెళ్లి హారతి దర్శనం చేయించి తీర్థం, శఠారీ మద్యాదలు చేసింది. ఇదంతా 10 నిమిషాల్లో ముగిసింది. తర్వాత 1.50 గంటల వ్యవథిలో బ్రేక్ దర్శనం పూర్తి చేసింది.

గురువారం ఉదయం నుంచే భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో ప్రోటోకాల్ వీఐపీలకు మర్యాదలు చేయించి ఇతరులను కులవేఖరపడి వరకు అనుమతించారు. శుక్రవారం ప్రోటోకాల్ ప్రముఖఉలకే వీఐపీ దర్శనం ఉంటుంది. అలాగే శనివారం వీఐపీ దర్శనం ఎటువంటి మర్యాదలు లేకుండా దర్శనం చేయించటంతో పాటు ఇతరులు లఘ దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయించింది. 

అలాగే గతంలో శ్రీవారికి భారీగా విరాళాలు ఇచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనాలకు కల్పించేవారు. ఇప్పుడది మారింది. రూ.కోటి విరాళమిచ్చిన దాతకు ఎల్-1 కింద, రూ10 లక్షలు ఇచ్చివారికి ఎల్ -2 కింద దర్శనానికి పర్మిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు వారికి బ్రేక్ దర్శనం మాత్రమే ఉంటుంది. దీనికితోడు రద్దీ లేని సమయాల్లోనే బ్రేక్ దర్శనం ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

Tirumala
lord venkateswara
Visit
Easy

మరిన్ని వార్తలు