వైరల్: అమ్మయ్యా.. దాహం తీరింది

Submitted on 2 January 2019
Thirsty koala,  heatwave, Australia, plastic bottle water

ఒకవైపు ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు వేగంగా వీస్తున్నాయి. ఏడారిని తలపించేలా 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో వడగాలులు పెరిగిపోయాయి.  మండుటెండలో ఓ బుజ్జి జంతువు ‘కోలా’ దాహంతో అలమిటిస్తోంది. ఇంతలో చంటెల్లి లౌరీ అనే యువతి అక్కడికి వచ్చింది. గుక్కెడు నీళ్ల కోసం ఎదురుచూస్తున్న కోలా జంతువును చూసి ఆమె మనస్సు తల్లడిల్లింది. వెంటనే తన వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ తో బుల్లి జంతువుకు నీళ్లు తాగించి దాహం తీర్చింది.

ఈ వీడియోను లౌరీ తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.  ఆస్ట్రేలియాలోని ఉత్తర స్ట్రాత్ మెర్టాన్, ముర్రే నది దగ్గర ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో యువతి లౌరీ.. కోలా దగ్గరకు వెళ్లగానే  వెంటనే అది భయంతో చెట్టు పైకి ఎక్కేసింది. ఏదోలా బుడ్డి కోలాకు ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను లౌరీ తాగించింది. దాహం తీరిన కోలా సంతోషంతో చెట్టుపైకి వెళ్లిపోయింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 

Thirsty koala
 heatwave
Australia
plastic bottle water

మరిన్ని వార్తలు