శుభ్రమైన దొంగ : దొంగతనానికి వచ్చి.. ఇళ్లంతా క్లీన్ చేసి పోయాడు!

Submitted on 25 May 2019
Thief Breaks Into House, Doesn't Steal Anything, Instead Cleans Home Leaves Behind Origami Flower

ఒంటి శుభ్రమే కాదు.. ఇళ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంటారు. ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఉంటే.. మనకే కాదు.. చూసేవాళ్లకు కూడా ఎంతో చిరాకుగా అనిపిస్తుంది. కొందరైతే.. ఇంట్లో కొంచెం మరక కనిపించినా వెంటనే క్లీన్ చేస్తుంటారు. మరికొంతమంది అయితే అసలే పట్టించుకోరు. కొన్నిరోజులు ఇంటికి తాళం వేసి ఎక్కడైనా వెళ్లి తిరిగి వచ్చిసరికి ఇళ్లంతా దుమ్ము దూళి పట్టేసి ఉంటుంది. వెంటనే వాక్యూం క్లీనర్ తో ఇంటిని శుభ్రం చేస్తుంటారు. లేదంటే.. అందుబాటులో ఉన్న వాటితో ఇంటిని శుభ్రం చేసుకుంటారు. కానీ, ఓ ఇంటిని క్లీన్ చేసింది అందులో ఉండేవారు కాదు... ఒక దొంగ. 

అదేంటీ.. దొంగ క్లీన్ చేయడమేంటీ అనుకుంటున్నారా? ఆ దొంగ మాములు దొంగ కాదు.. అతడో శుభ్రమైన దొంగ. దొంగతనం చేయాలంటే.. ఆ ఇల్లు శుభ్రంగా ఉండాలి. లేదంటే.. దొంగతనం చేయడు. ఓ రోజు దొంగతనం చేయాలని అనుకున్నాడు. ఒక ఇంటికి తాళం వేసి ఉండటం గమనించాడు. ఆ రాత్రే దొంగతనానికి స్కెచ్ వేశాడు. మెల్లగా ఇంట్లోకి దూరాడు. కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. 

అంతే.. ఆ ఇంట్లో అంతా మురికే. వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి. ఇళ్లు శుభ్రం చేయని ఇంట్లో దొంగతనం చేయాలనిపించలేదు. వెంటనే.. ఇంట్లో వస్తువులను, బెడ్ రూం నీట్ గా సర్దిపెట్టాడు. ఒక కిచెన్ రూమ్ తప్ప ఇళ్లంతా క్లీన్ చేశాడు.. పోతూ పోతూ.. సువాసనలు వెదజల్లే రోజా పువ్వు, పరిమాళాలను ఇంట్లో, బాత్ రూంలో పెట్టి పోయాడు. మరుసటి రోజున ఆ ఇంటివారు తిరిగి వచ్చారు. తలుపు తీసే సరికి.. ఇంట్లో నుంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. 

వేసిన తాళం వేసినట్టే ఉంది.. తాము లేని సమయంలో ఇంట్లో ఎవరైనా ఉండి పోయారా? అని సందేహం వచ్చింది. ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. అసలు విషయం తెలిసి వారంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ.. మసూచిసెట్స్ లోని మార్ల్ బోరగ్ లో... నేట్ రొమన్ (44) అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. దొంగతనానికి వచ్చిన దొంగ.. ఏమి దోచుకెళ్లకుండా ఇళ్లు శుభ్రం చేసి పోయాడని.. ఇతడో శుభ్రమైన మంచి దొంగ అంటూ మెచ్చుకున్నారు.

Thief
house
Steal
 Cleans Home
Origami Flower
Nate Roman
US
Thief cleaner

మరిన్ని వార్తలు