ఈ టమోటాలు కారంగా ఉంటాయి

Submitted on 9 January 2019
These tomatoes are spicy

పచ్చిమిర్చి కొరికితే కారంగా ఉంటుంది, కారం తిన్నా నోరు మండి పోతుంది. కానీ వాటిలో ఉండే   కాప్సినాయిడ్ రసాయనాల వల్ల  బోలెడన్నీ ఉపయోగాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పచ్చి మిరపకాయలో కారం పుట్టించే కాప్సినాయిడ్  బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఊబకాయం, నొప్పి తగ్గించే విషయంలో ఈ కాప్సినాయిడ్లు  ప్రముఖ పాత్ర పాత్ర పోషిస్తాయని  శాస్త్రజ్ఞలు చెపుతున్నారు. అంతేకాదు కాప్సినాయిడ్ జాతికి చెందిన ఆహారపదార్థాలు, అంటే మిరప, మిరయాల వంటి వాటిని  తిన్నప్పుడు రక్తంలో కొలెస్టరాల్  తగ్గటం, రక్తపోటు చాలావరకు అదుపులో ఉండడాన్ని  శాస్త్రజ్ఞులు గుర్తించారు. 
ఇంకేం వీటిని విపరీతంగా పండిస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారేమో.... వీటిని పెద్దఎత్తున పండించడం అంత ఈజీ కాదు. మిరప, మిరియాలు, కాప్సికం వంటి వాటిల్లోనూ ఇవి తక్కువగా ఉంటాయి. పంట పంటకూ తేడాలూ ఉంటాయి. సులువుగా పండించుకోవాలంటే టామోటాల్లో కాప్సినాయిడ్లు ఉత్పత్తి చేసే జన్యువులను మళ్లీ ఆన్  చేస్తే సరి పోతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
టమోటా, కాప్సికమ్‌లు రెండూ ఒకేజాతికి చెందినవే అని రెండు కోట్ల ఏళ్ల కిత్రం  ఇవి రెండూ విడిపోయాయని, కాకపోతే రెండింటిలోనూ ఒకే రకమైన జన్యువులు కొన్ని ఉండటం గమనార్హమని తాజా ప్రతిపాదన తీసుకొచ్చిన శాస్త్రవేత్త అగస్టిన్‌ సైన్‌. ఈ జన్యువుల్లో కాప్సినాయిడ్‌ ఉత్పత్తి చేసేవి కూడా ఉన్నాయని.. ఇవెలా పనిచేస్తాయో తెలుసుకుని టమోటాల ద్వారా బహుళ ప్రయోజనకరమైన కాప్సినాయిడ్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం ఎంతైనా ప్రయోజనకరమని ఆయన వివరించారు.

Tomato
Capsicum
Investigation
capisinoids
research
Scientist
spicy

మరిన్ని వార్తలు