బ్రిటన్ ప్రధాని రాజీనామా!

Submitted on 24 May 2019
Theresa May resignation

బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే త్వరలో రాజీనామా చేయబోతున్నారు. బ్రెగ్జిట్‌ పై ఆమె వైఖరిపై ఘాటైన విమర్శలు వస్తుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.జూన్-3న పటిష్టమైన బ్రెగ్జిట్ డీల్‌ను ప్రవేశపెడతానని థెరిసా గత వారం హామీ ఇచ్చారు. దీనిపై తన ఇతర పార్టీలతోపాటు సొంత పార్టీ నాయకుల నుంచి కూడా తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఆమె తన పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. 

శుక్రవారం(మే-24,2019)థెరిసా మాట్లాడుతూ... ప్రధాని పదవికి జులై-7,2019న రాజీనామా చేస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానన్నారు.బ్రెగ్జిట్ డీల్‌ ను మూడుసార్లు తిరస్కరించారని,దీనికి మద్దతివ్వాలని ఎంపీలకు నచ్చజెప్పేందుకు చాలా కృషి చేశానని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని థెరిసా మే తెలిపారు.2016 జలైలో థెరిసా ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు.

theresa may
resignation
BREXIT
BRITAN
June
failure

మరిన్ని వార్తలు