నాగబాబుతో విబేధాలు లేవు - జీవితా రాజశేఖర్

Submitted on 25 May 2019
There are no disagreements with Nagababu

ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా తాము ఎక్కడా ప్రచారం చేయలేదని..ప్రజారాజ్య పార్టీ ఏర్పడిన సమయంలో ఉన్న మనస్పర్థలు పోవడానికి ఇన్నేళ్ల సమయం పట్టిందని సినీ నటుడు రాజశేఖర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు వారి వారి పార్టీ కోసం మాట్లాడుతారని..ఇతర పార్టీలను విమర్శిస్తుంటారని జీవిత తెలిపారు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్..రాజశేఖర్ గురించి చాలా మంది అడిగారని..తమవల్ల వారికి డబ్బులు వస్తే మంచిదేకదా అని అన్నట్లు తెలిపారు. ఇలాంటి వార్తలు పవన్..నాగబాబులు కూడా పట్టించుకోరన్నారు. కాకపోతే మధ్యలో వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నట్లు..ఇలాంటి వాటిని ఆపేయాలన్నారు జీవిత. మే 25వ తేదీన వారు మీడియాతో మాట్లాడారు. 

వైఎస్ జగన్ విజయంలో తాము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని సినీ నటులు రాజశేఖర్, జీవిత తెలిపారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయంలోనూ తమ పాత్ర ఉండటం ఆనందంగా ఉందని..జగన్ పాదయాత్రలో పాల్గొన్నప్పుడే విజయ సంకేతాలు అందాయని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. జగన్ గెలుస్తాడని ముందే తెలుసన్న రాజశేఖర్..ఆయన గెలుపునకు ప్రజలే కారణమన్నారు. జగన్‌కు ఓటు వేసిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పార్టీలో తమ పాత్ర ఎలా ఉంటుందో తెలియదని..మా అసోసియేషన్ ఎన్నికల్లో మద్దతిచ్చిన నాగబాబుకు..తమకు ఎలాంటి విబేధాలు లేవన్నారు.

ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదు..మా ఎన్నికల్లో నాగబాబు ఇంటింటికి వెళ్లి ఓటు వేయించలేదని గుర్తు చేశారు. మా ఎన్నికల్లో తమకు నాగబాబు అండగా నిలబడ్డారన్నారు. జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారు. కానీ సామాన్యుడిలా పాదయాత్ర చేసి ప్రజలను కలిశారని..ఒక అవకాశం ఇచ్చి ప్రజలు చూద్దామని అనుకున్నారని తెలిపారు. తమ గరుడ వేగను చిరంజీవికి, జగన్‌కు చూపిద్దామనుకున్నామని..సోషల్ మీడియాలో తమ కుటుంబంపై విచక్షణ రహితంగా దుర్భాషలాడుతున్నారని..దీనివల్ల తామే కాక..చాలా మంది సెలబ్రెటీలను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసే వారు ఒక్కసారి ఆలోచించుకోవాలని..గబ్బర్ సింగ్ లో రాజశేఖర్‌ను చాలా అవమానించినా..మాట్లాడలేదని జీవిత తెలిపారు. 

no disagreements
Nagababu
MAA
Jeevitha Rajasekhar
Rajasekhar

మరిన్ని వార్తలు