TG News

Thursday, November 1, 2018 - 15:38

వరంగల్: మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన తిరునగరి మారుతీరావు, అబ్దుల్ కరీం, తిరునగరి శ్రవణ్ కుమార్‌లను మిర్యాలగూడ నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులైన ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు...

Thursday, November 1, 2018 - 15:16

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ జాబితా విడుదల చేసేందుకు ముహూర్తం కుదరడం లేదని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజులవుతున్నా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ని ఓడించేందుకు కాంగ్రెస్ పెద్దన్నగా మారి మహా కూటమి తెరపైకి తెచ్చింది. ఇందులో టీడీపీ,...

Thursday, November 1, 2018 - 14:25

నల్గొండ : మహాకూటమికి 10 సీట్ల రాకుంటే..తాను గెలిచినా రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కోమటిరెడ్డి ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. శుక్రవారం మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. నల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 

 

Thursday, November 1, 2018 - 14:12
మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా ఈ జిల్లా నుంచే బరిలో దిగుతున్నారు. దీంతో మహాకూటమిలోని ఇతర పార్టీలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం ఐదు స్థానాలే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ అవి ఏంటి? వాటిలో ఎవరు పోటీ పడుతున్నారు?
 
ఉమ్మడి...
Thursday, November 1, 2018 - 11:31

హైదరాబాద్ : మహాకూటమి పొత్తుల వ్యవహారం హస్తినకు చేరింది. కూటమిలోని ప్రధాన పార్టీల నేతలంతా ఒక్కొక్కరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ యేతర ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో భాగంగా జాతీయ నేతలను కలిసేందుకు చంద్రబాబు, సీట్ల సర్దుబాటుపై రాహుల్‌ను...

Thursday, November 1, 2018 - 10:27

కరీంనగర్ : టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ రగులుతోంది. సీటు ఆశించిన ఆశావహులు జాబితాలో పేరు రాకపోవడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో పేరు ప్రకటించకపోవడంతో కొండా సురేఖ దంపతులు, బాబుమోహన్‌తోపాటు పలువురు నేతలు టీఆర్ఎస్‌, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా గులాబీ పార్టీలో మరో అసమ్మతి స్వరం...

Thursday, November 1, 2018 - 09:14

హైదరాబాద్ : నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగతంతో వెళ్తున్న కారు అదుపు తప్పి ఆటో, టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారు డ్రైవర్‌ను పోలీసులు...

Thursday, November 1, 2018 - 08:56

ఢిల్లీ : మహాత్మగాంధీ కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పవాడా ? అని సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ కూడా పటేల్ పుట్టిన గడ్డ మీదే పుట్టారని..ఆయన్నుగుర్తించకపోవడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. పేదలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే.. ప్రధాని మోడీ.. విగ్రహాలకు భారీగా ఖర్చు...

Wednesday, October 31, 2018 - 20:15

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల లొల్లి ఓకొలిక్కి రాలేదు. అభ్యర్థుల జాబితాపై కూడా ఇంకా ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ఖరారైన అభ్యర్థుల జాబితతో సహా అధిష్టాన్ని కలిసేందుకు  ఉత్తమ్ ఢిల్లీ ప్రయాణమై వెళ్లారు. టీఆర్ఎస్ తొలి 105మంది జాబితాను ఖరారు కేసిన ప్రచారంలో దూసుకుపోతున్న క్రమంలో కూడా ఎన్నికల...

Wednesday, October 31, 2018 - 19:19

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ జోరు పెంచింది. ఇప్పటికే 38మందితో ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ.. రెండో లిస్టును కూడా సిద్ధం చేసింది. గురువారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అభ్యర్థుల జాబితాతో తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంటు బోర్డు కమిటీ...

Wednesday, October 31, 2018 - 15:34

హైదరాబాద్: ఎట్టకేలకు కసరత్తు ముగిసింది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. ఎన్నో రోజులుగా చర్చించిన అనంతరం అభ్యర్థులను భక్తచరణ్ దాస్ కమిటీ ఖరారు చేసినట్టు తెలస్తోంది. 40మందితో తొలి జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. నవంబర్ తొలి వారంలో తొలి జాబితా విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే...

Wednesday, October 31, 2018 - 15:24

మహబూబ్ నగర్ : కరవు, వలసలు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా గుర్తుకు వస్తుంది. రాజకీయ ప్రముఖులు కలిగిన జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర మాజీ మంత్రి డీకే.అరుణ, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ...

Wednesday, October 31, 2018 - 11:12

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. డిసెంబర్ మాసంలో ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. దీనితో అధికారపక్షం, విపక్షాల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అధికారపక్ష టీఆర్ఎస్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దూసుకపోతోంది. మరికొన్ని...

Wednesday, October 31, 2018 - 08:56

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై ఏపీ డీజీపీ స్పందించారు. ఇంటెలిజెన్స్‌ ఏడీజీతో మాట్లాడి సమగ్ర వివరాలతో డీజీపీ రిప్లై పంపారు. దొరికిన వారంతా నోటీసులో చెప్పిన విధంగా వారంతా ఇంటెలిజెన్స్‌ అధికారులేనని స్పష్టం చేశారు. వారి దగ్గర నగదు ఉందనేది కూడా అవాస్తవమన్నారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో సమాచారం...

Wednesday, October 31, 2018 - 08:42

హైదరాబాద్ : మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన టీజేఎస్‌కి ఇప్పటిదాకా 8 సీట్లు ఖరారు అయినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామగుండం, వరంగల్‌ తూర్పు, మల్కాజిగిరి, మిర్యాలగూడ, అశ్వారావుపేట, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ నుంచి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి టీజేఎస్‌...

Wednesday, October 31, 2018 - 08:18

హైదరాబాద్ : గులాబి దళపతి కేసిఆర్.... ప్రచార వ్యూహాన్ని మార్చబోతున్నారా?  సుడిగాలి పర్యటనలకు బదులు.. ద్విముఖ ప్రచార వ్యూహంపై దృష్టి సారించారా?  అందుకు ట్రయల్ రన్ కూడా కేసిఆర్ నిర్వహించారనే ప్రచారంలో వాస్తవమెంత? ఇంతకీ కేసీఆర్ ప్రచార వ్యూహం ఏంటి?

ముందస్తు ఎన్నికలను ఎంతో జోష్ గా ఎదుర్కొనేందుకు వ్యూహం రచించిన గులాబి...

Tuesday, October 30, 2018 - 21:13

నల్గొండ: ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల దాడులే కాదు, భౌతిక దాడులూ జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడే...

Tuesday, October 30, 2018 - 17:14

నల్లగొండ : అన్ని పార్టీలు పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని  మిర్యాలగూడ స్థానమే. ఈ నియోజక వర్గంలోని కొన్ని ప్రాంతాలలో అధికంగా గిరిజన జనాభా వుంటుంది. దీంతో మిర్యాలగూడలో ఎవరు గెలుపొందాలి? ఏ పార్టీ గెలుపు సాధించాలి? అనే విషయాన్ని వారే...

Tuesday, October 30, 2018 - 16:52

నల్లగొండ : జిల్లాల విభజన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల గురించి ఈ ఎన్నికల సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ఉమ్మడిగా వున్న నేపథ్యానికి ఈనాటి ఎన్నికల సమయంలో విభజన జిల్లాలలో వున్న నేపథ్యానికి వ్యత్యాసం వుంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మహాకూటమి పొత్తుల్లో...

Tuesday, October 30, 2018 - 11:34

హైదరాబాద్ : రాజకీయాలంటే రొచ్చు. రాజకీయాలంటే పార్టీల మధ్య కంటే మనుషులపై మనుషులు పోరాడే యుద్ధం. రాజకీయమంటే రణరంగం. రాజకీయమంటే రచ్చ. ఇప్పటి వరకూ యువతలో వుండే భావనలివి. కానీ వర్శిటీలలో పీహెచ్ డీలు చేసి పట్టా పుచ్చుకుని నేరుగా రాజకీయాలలోకి అడుగిడుతున్నారు నేటి తరం. దీనికి వేదిక ఇటీవలే 100ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న...

Tuesday, October 30, 2018 - 11:34

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డును ఓ దొంగ పట్టపగలే బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించాడు. బొమ్మ తుపాకీతో సినీ ఫక్కీలో బ్యాంక్‌ దోపిడీకి యత్నించాడు. అయితే కస్టమర్లు చాకచక్యంగా అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

విశాఖపట్నానికి చెందిన డేవిడ్‌ కొన్నాళ్లుగా రాయదుర్గంలో నివాసముంటున్నాడు. హైదరాబాద్‌‌...

Tuesday, October 30, 2018 - 10:30

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రకటన చేయడానికి "సంతోషిస్తున్నా.. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. అందరి ఆశీస్సులు, దీవెనలు సంతోషానికి కలిగించాయి" అని ట్వీట్ చేశారు...

Tuesday, October 30, 2018 - 09:56

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై పలువురు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఐఏఎస్‌ అధికారులు  మండిపడుతున్నారు. ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందంటూ ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనంత విద్వేశపూరితమైన వివక్ష ఇక్కడ కనిపిస్తోందని ధ్వజమెత్తారు. తమను లక్ష్యంగా చేసుకుని అప్రాధాన్య పోస్టుల్లో నియమిస్తోందని ఆరోపిస్తున్నారు...

Tuesday, October 30, 2018 - 09:34

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఈసీ దూరం పెట్టింది. తెలంగాణ ఎన్నికల బందోబస్తుకు ఏపీ పోలీసులను వినియోగించకూడదని నిర్ణయించింది. ఏపీ ఇంటిలిజెన్స్ పోలీసులు.. తెలంగాణ ఓటర్లను ప్రలోభ  పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రచారంలో అభ్యర్ధుల తీరుతెన్నులను పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు ఖర్చులను...

Tuesday, October 30, 2018 - 08:54

హైదరాబాద్ : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. సుదీర్ఘ చర్చలు, వడపోతల తర్వాత 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఆ జాబితాతో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ రాత్రి ఢిల్లీకి వెళ్లింది.  నవంబర్‌ 1న రాహుల్‌ నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై తొలి జాబితాకు ఆమోదముద్ర...

Tuesday, October 30, 2018 - 08:42

హైదరాబాద్ : తుది మ్యానిఫెస్టోను నవంబరు 6న విడుదల చేసేందుకు టీఆర్‌ఎస్ సిద్ధం అవుతోంది. పలు కీలకమైన హామీలతో పాటు, భారీ సంఖ్యలో కొత్త ప్రతిపాదనలు తుది మ్యానిఫెస్టోలో ఉండేలా ఆ పార్టీ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తున్నారు. 

ఈ నెల 17న పాక్షిక మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్ 8 హామీలను ప్రకటించారు. మిగిలిన హామీలపై...

Tuesday, October 30, 2018 - 07:53

హైదరాబాద్: రాష్ట్రంలో ఎవరి ఫోన్లు ట్యాపింగ్ కు గురవ్వట్లేదని రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి రజత్కుమార్ చెప్పారు. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని పలువురు ప్రతిపక్షనేతలు ఇటీవల సీఈవోకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రజత్కుమార్ డీజీపీని  వివరణ కోరారు. జాతీయభద్రత, నేరాల అదుపుకోసం కట్టుదిట్టమైన విధి,...

Pages

Don't Miss