TG News

Saturday, November 3, 2018 - 17:25

హైదరాబాద్ : మహా కూటమి సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, జనసమితి, టీడీపీ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయా పార్టీల నేతలు హస్తినకు వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపారు. సీట్ల సర్దుబాటు కుదరలేదని.....

Saturday, November 3, 2018 - 15:16

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుండే సమస్యలు వస్తున్నాయి. అంతర్గత విబేధాలు...పార్టీ నేతల మధ్య విబేధాలు పొడచూపుతున్నాయి. దీనితో పార్టీ పరువు కాస్తా బజారున పడుతోంది. తాజాగా మిర్యాలగూడలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశం రచ్చ...

Saturday, November 3, 2018 - 14:21
కామారెడ్డి : ఓట్ల కోసం రాజకీయ నేతలు పడరాని పాట్లు పడతారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగేవారు కొందరైతే.... డప్పు కొట్టి, డ్యాన్స్‌ చేసేవారు ఇంకొందరు. కానీ ’నాకు ఓటు వేయకండి’ అని మైకుపట్టి ప్రచారం చేస్తున్నాడు ఓ అభ్యర్థి. అంతేకాదు ఓటు వేయవద్దని ప్రచార రథానికి సైతం బ్యానర్లు కట్టుకని మరీ గ్రామాల్లో తిరుగుతున్నాడు.
 
కామారెడ్డి జిల్లా...
Saturday, November 3, 2018 - 14:06

ఖమ్మం : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో రాజకీయాల్లో చెప్పడం కష్టం. ఇప్పుడు అదే ఖమ్మం జిల్లాలో జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పుగా ఉన్న జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. మూడు దశాబ్దాలపాటు ఉన్న వైరాన్ని...

Saturday, November 3, 2018 - 12:51

కరీంనగర్ : కోదండరాంకు టీఆర్ఎస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సవాల్ విసిరారు. దమ్ముంటే కోదండరాం రామగుండంలో పోటీ చేయాలన్నారు. ఈమేరకు రామగుండంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. గెలిస్తే కోదండరాంపైనే గెలవాలన్నారు. 

 

Saturday, November 3, 2018 - 12:21

హైదరాబాద్ : ప్రగతి సూచికలుగా గుర్తించే విద్యుత్‌ వినియోగం, తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిశాతం నమోదు చేయడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు విభాగాల్లోనూ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసి దేశంలో ప్రథమ స్థానంలో...

Saturday, November 3, 2018 - 11:16

హైదరాబాద్: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గెలుపు వ్యూహాలు రచిస్తూ... అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు. ప్రచార తీరు తెన్నులపై అభ్యర్థులను అలర్ట్‌ చేస్తున్న గులాబీ దళపతి... పండుగలు, పబ్బాలను ప్రచారానికి...

Saturday, November 3, 2018 - 10:36

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా నగదు పట్టుబడింది. ఓ మహిళ నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న సబీరా అనే మహిళ నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబీరాను సీఐఎస్ఎఫ్ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. సబీరాను ఎయిర్‌...

Saturday, November 3, 2018 - 09:31

హైదరాబాద్ : దాదాపు దశాబ్దకాలం నాటి సత్యం కుంభకోణంలో సెబీ తాజాగా సంచలన ఆదేశాలు ఇచ్చింది. సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుడైన బి.రామలింగరాజును 14 ఏళ్లపాటు సెక్యూరిటీస్‌ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేకుండా నిషేధించింది. దీంతోపాటు చట్టవ్యతిరేకంగా సంపాదించిన 813.40 కోట్ల మొత్తాన్ని, వడ్డీతో తిరిగి చెల్లించాలని...

Saturday, November 3, 2018 - 07:41

హైదరాబాద్‌ : నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాంపల్లిలోని అల్లందుల్ల హోటల్ పక్కనే ఉన్న ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా షాప్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా...

Friday, November 2, 2018 - 18:58

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గడపగడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని 13వ వార్డులో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...

Friday, November 2, 2018 - 15:41

హైదరాబాద్ : టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఎన్నికల వేళ ఇదంతా సాధారనమే అయినా తెలంగాణలో తన పట్టు సాధించుకోవటానికి కమల దళం అసంతృప్తి నేతలతో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీలో...

Friday, November 2, 2018 - 15:03

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ రెండో జాబితా విడుదల చేసిన అనంతరం ఒక్కసారిగా విబేధాలు భగ్గుమన్నాయి. టికెట్లు ఆశించిన వారికి బీజేపీ అధిష్టానం మొండిచెయ్యి చూపడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కాకుండా వేరే వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వివిధ...

Friday, November 2, 2018 - 14:28

ఢిల్లీ : మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. దీనిపై త్వరగా విచారించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఫిబ్రవరిలో విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. దీనితో మరలా ఒకసారి ఓటుకు నోటు కేసు వార్తల్లోకెక్కింది. 
ఓటుకు నోటు కేసు...

Friday, November 2, 2018 - 14:28

ఖమ్మం : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో రేపు ప్రసాద్‌రావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్‌రావుపై సస్పెన్షన్ ఎత్తివేసింది. పార్టీలోకి రావాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన్ను ఆహ్వానించారు....

Friday, November 2, 2018 - 12:39

హైదరాబాద్: ఈ బాలుడు పేరు... మహమ్మద్ హసన్ ఆలీ. వయస్సు.. 11 ఏళ్లు.. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా 7వ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు ఏకంగా బీ.టెక్, ఎమ్‌టెక్ చదువుతున్న విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 
హైదరాబాద్‌కు చెందిన హసన్ ఆలీ తనకంటే పెద్దవాళ్లకే చదువుచెబుతూ అందరి...

Friday, November 2, 2018 - 12:28

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఢిల్లీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో తెలంగాణ నేతలు జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు..పార్టీ..ప్రతిష్ట మరింత మెరుగుపరచాలని అమిత్ షా యోచిస్తున్నారు. ఇప్పటికే షా రెండుసార్లు తెలంగాణలో పర్యటించారు. రెండో...

Friday, November 2, 2018 - 11:31

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పార్టీలో అసమ్మతులు చల్లబడడం లేదు. తమకు టికెట్ రాదని..టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీలోకి జంప్ కావాలని పలువురు నేతలు యోచిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వేరే పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 107 మంది అభ్యర్థులను ప్రకటించేసిన...

Friday, November 2, 2018 - 11:29

హైదరాబాద్ : టీఆర్ఎస్‌లో పెండింగ్‌ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. త్వరలోనే అన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామన్న అధిష్ఠానం ప్రకటనతో ఆశావహులు తమకే సీటు వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మరికొంత మందికి అధిష్ఠానం ఇన్‌ డైరెక్ట్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. 

అసెంబ్లీని రద్దు...

Friday, November 2, 2018 - 09:59

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి ఇక్కడ తమ ప్రభావం చూపించాలని కాషాయ దళం ఆరాటపడుతోంది. ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక నజర్ పెట్టారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన తెలంగాణలో పర్యటించారు. మొదటి జాబితాను ప్రకటించిన బీజేపీ రెండో జాబితాను ప్రకటించేందుకు...

Friday, November 2, 2018 - 09:45

ఢిల్లీ : మహాకూటమి సీట్ల పంచాయతీ హస్తినకు చేరింది. మహాకూటమి నేతలు సీట్ల పంపకాలపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఢిల్లీలో మకాం వేశారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కోదండారం భేటీ కానున్నారు. రాహుల్‌తో భేటికి ముందే అశోక్ గెహ్లాట్, జైరా రమేశ్‌లతో ఆయన సమావేశం...

Friday, November 2, 2018 - 08:35

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో జస్టిస్‌ సుభాష్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం గుజరాత్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్న ఆర్ సుభాష్‌రెడ్డి.....

Friday, November 2, 2018 - 08:20

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వచ్చిందా? 95స్థానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనపై కూటమిలోని పార్టీలు ఏమంటున్నాయి? రాహుల్‌తో కోదండరామ్ భేటీ తరువాత పంపకాల సస్పెన్స్‌కు తెరపడనుందా? ఎపట్లోగా కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలయ్యే అవకాశముంది?

మహాకూటమిలో సీట్ల స‌ర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు...

Thursday, November 1, 2018 - 20:26

ఢిల్లీ: బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఢిల్లీ చేరిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవన్‌లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను తెలంగాణను పరిపాలించను, సీఎంను కాను అని అన్నారు. ఏపీలో పరిపాలిస్తే చాలన్నారు. తెలంగాణలో తమ నాయకులు ఉన్నారని, వాళ్లు ఎదగాలని...

Thursday, November 1, 2018 - 19:19

మహబూబ్ నగర్ : జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కల్వకుర్తి కూడా ఒకటి. ముందస్తు ఎన్నికల్లో కల్వకుర్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు నిరాశకు లోనవుతున్నారు. వారిలో కసిరెడ్డి నారాయణరెడ్డి ఒకరు. ఈ నియోజక వర్గం టికెట్ ఆశించి తీవ్ర మనస్తాపానికి గురైన కసిరెడ్డి నారాయణరెడ్డి కేటీఆర్ బుజ్జగించారు. కల్వకుర్తి టీఆర్ఎస్...

Thursday, November 1, 2018 - 17:44

హైదరాబాద్  : లగడపాటి రాజగోపాల్ మాజీ ఎంపీ. ఈయన అవకాశం వస్తే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ తరపునుండి గానీ..కాంగ్రెస్ తరపు నుండి గానీ...

Thursday, November 1, 2018 - 16:19

హైదరాబాద్: బీజేపీలో టికెట్ల గొడవ ముదురుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీజేపీ కార్యాలయం ముందు ఆశావహులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి బుచ్చిరెడ్డి, కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి శ్రీనివాసరెడ్డిలు రాజీనామా చేశారు. పార్టీని నమ్ముకున్న...

Pages

Don't Miss