TG News

Monday, November 12, 2018 - 19:13

హైదరాబాద్: టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే అంటూ టీవీ ఛానెళ్లలో వస్తున్న వార్తలపై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీవ్రంగా స్పందించారు. ఆ జాబితా పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు. అసలు టీడీపీ తరపున అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని రమణ స్పష్టం చేశారు. మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే...

Monday, November 12, 2018 - 17:41

హైదరాబాద్: తెలంగాణ జనసమితి అభ్యర్థుల జాబితాను నవంబర్ 13న సాయంత్రంలోపు ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత, ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. కామన్ గుర్తుపై కాకుండా తమ పార్టీ గుర్తు అయిన ‘అగ్గిపెట్టె’పైనే పోటీ చేస్తామని చెప్పారు. మహాకూటమిలోని అందరిని కలుపుకుని టీజేఎస్ పోటీ చేస్తుందని, సీపీఐని కూడా కలుపుకుని ముందుకు...

Monday, November 12, 2018 - 17:24

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు ? కాంగ్రెస్‌లో లెక్కల లొల్లి పూర్తి కాలేదా ? ప్రస్తుతం దీనిపై కాంగ్రెస్ కేడర్ తీవ్రంగా చర్చించుకొంటోంది. కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఇతర సీనియర్ నేతలు హస్తినకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు...

Monday, November 12, 2018 - 17:24

హైదరాబాద్ : కోదండరాం కాంగ్రెస్,  చంద్రబాబు మాయలో పడిపోయారని..ఉద్యమ సమయంలో కోదండరాంను తాము కంటికి రెప్పలా కాపాడుకున్నామనీ..కాంగ్రెస్ నుండి కాపాడుకున్నామని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ సాధించేంత వరకు కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, చంద్రబాబు ఎంత...

Monday, November 12, 2018 - 16:55

హైదరాబాద్: తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధినేత, ప్రొఫెసర్ కోదండరామ్‌పై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు. నాడు తెలంగాణ ఉద్యోగులను, ఉద్యమకారులను రాచి రంపానపెట్టిన కాంగ్రెస్, తెలంగాణ ద్రోహి అయిన టీడీపీలతో కోదండరామ్ ఎలా పొత్తుపెట్టుకుంటారని హరీష్ ప్రశ్నించారు. ఆ సమయంలో కోదండరామ్‌కు రక్షణ కవచంలా నిలిచింది...

Monday, November 12, 2018 - 16:15

హైదరాబాద్ : నామినేషన్ల పర్వంలో మొదటి రోజు ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 12వ తేదీ నుండి నామినేషన్ల పర్వం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు అంతగా సందడి కనిపించలేదని చెప్పవచ్చు. పలు ప్రాంతాల్లో సీనియర్ నేతలు నామినేషన్‌లు దాఖలు చేశారు. కార్యకర్తల సందడి మధ్య నేతలు నామినేషన్‌లు దాఖలు చేశారు. 119...

Monday, November 12, 2018 - 15:23

హైదరాబాద్: విపక్షాల్లోనే కాదు అధికార పార్టీలోనూ టికెట్ల వివాదం చెలరేగింది. టికెట్ల కోసం టీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా మొదలవడంతో టికెట్లను ఆశిస్తున్న ఆశావహులు తమ తుది ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఖైరతాబాద్ టికెట్ కోసం టీఆర్ఎస్‌లో...

Monday, November 12, 2018 - 15:08

హైదరాబాద్  : పెట్రోలు ధరలకు రెక్కలు రావటంతో బెంబేలెత్తిన సామాన్యుడు గత నెల రోజుల నుండి ఊరిపి తీసుకుంటున్నాడు. కారణం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టటమే కారణం. పెట్రోలుపై పెంచిన సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని కొందరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ...

Monday, November 12, 2018 - 15:01

ఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కోపం వచ్చింది. అదీ సొంత పార్టీ నేతలపైనే. తెలంగాణ కాంగ్రెస్ నేతలతీరుపై రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా... ఇంకా, అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో...

Monday, November 12, 2018 - 13:35

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఒకవైపు, కేసీఆర్ కుటుంబం ఒకవైపు ఉందని తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  కాంగ్రెస్ ప్రచార కమిటి ఛైర్మన్ మల్లు భట్టివిక్రమార్క నివాసంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఈ పెద్దిరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు...

Monday, November 12, 2018 - 13:26

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో కూడా టికెట్ల లొల్లి నెలకొంది. ‘సేవ్ టీడీపీ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నేతలు ఆందోళనలకు దిగారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కొన్ని సీట్లను కాంగ్రెస్ కేటాయించింది. దీనిపై కొందరు టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గెలిచే స్థానాలను కాంగ్రెస్‌కు...

Monday, November 12, 2018 - 12:32

హైదరాబాద్ : గాంధీ భవన్‌‌ నిర్మానుష్యంగా మారిపోయింది. బయట పోలీసులు..లోపల బౌన్సర్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో భద్రతను పటిష్టం చేశారు. తమకు టికెట్ కేటాయించాలంటూ పలువురు నేతలు..కార్యకర్తలు గాంధీభవన్ వద్ద ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో టీపీసీసీ పలు చర్యలు తీసుకొంటోంది...

Monday, November 12, 2018 - 12:14

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ముసాయిదా ప్రతికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌ విడుదలతో నామినేషన్ల ఘట్టం...

Monday, November 12, 2018 - 11:47

హైదరాబాద్ : ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు హస్తినకు చేరింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ అధినేతలతో చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే...

Monday, November 12, 2018 - 11:10

మేడ్చల్‌ : ’ఓట్ల కోసం మా గ్రామానికి రావొద్దు’ అని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఓట్ల కోసం ’మా వద్దకు రావద్దని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తేనే రాజ్యాంగ హక్కును వినియోగించుకుంటాము’ అని జిల్లాలోని జవహర్‌నగర్‌ వాసులు ఆందోళన చేపట్టారు. జవహర్‌నగర్‌ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌ బస్తీవాసులు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయొద్దని ఆదివారం...

Monday, November 12, 2018 - 10:53
హైదరాబాద్ : టీడీపీ నియోజకవర్గాలు ఫైనల్ అయ్యాయి. అధికారికంగా ప్రకటించకపోయినా.. అభ్యర్థులు ఆల్ రెడీ ప్రచారంలోకి దిగిపోయారు. నామినేషన్స్ టైం కూడా వచ్చేయటంతో బి.ఫారం కోసం వెయిట్ చేస్తున్నారు. కూటమిలో సర్దుబాట్లు కొలిక్కి రాకపోయినా.. టీడీపీ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన 14 సీట్లతోనే సరిపెట్టుకుని... నియోజకర్గాలను డిసైడ్ చేసుకుంది. నియోజకవర్గాల్లో...
Monday, November 12, 2018 - 09:24

హైదరాబాద్: కార్తీకమాసం మొదటి సోమవారం కావటంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తలతో పోటెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. పాతాళగంగలో స్నానంచేసి భక్తులు స్వామి వారిని దర్శించుకోటానికి క్యూలైన్లలో వేచి వున్నారు. ఆలయ అధికారులు తెల్లవారు ఝూమున 3 గంటల నుంచే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు....

Monday, November 12, 2018 - 08:41

హైదరాబాద్ : లగ్నపత్రిక రాసుకోవాల్సిన రోజునే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి సమీపంలోని తుక్కుపూర్‌కు చెందిన నర్సింహ(28) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వనస్థలిపురంలోని ఆర్టీసీ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో 2012 నుంచి నివాసముంటున్నాడు. ఇటీవల...

Monday, November 12, 2018 - 07:36

హైదరాబాద్: తెలంగాణా లోని 119వ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు గెజిట్  నోటిఫికేషన్  సోమవారం  విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ముసాయిదా ప్రతికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. దానికి అనుగుణంగా  ఎన్నికల నిర్వహణ కోసం  రాష్ట్ర నోటిఫికేషన్  జారీ చేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నామినేషన్ల కోసం...

Sunday, November 11, 2018 - 22:17

హైదరాబాద్ : నగరంలో విషాదం నెలకొంది. వెన్నునొప్పి భరించలేక ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  

గుంటూరు జిల్లా రెడ్డి పాలెంకు చెందిన ఇన్నమూరి శ్రీకాంత్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీకి చెందిన...

Sunday, November 11, 2018 - 21:25

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు నిలదీసినా కోపగించుకోవద్దని, ఓపికగా ఉండాలని అభ్యర్థులకు సూచించారాయన. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు 107మందితో ఆదివారం భేటీ అయిన కేసీఆర్.. వారందరికి...

Sunday, November 11, 2018 - 21:10

హైదరాబాద్ : హైదరాబాద్ మినీ భారత్ అని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. నగరంలోని లలితాకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మరాఠీలు, గుజరాతీలు, బెంగాలీలు అన్ని రాష్ట్రాలవాళ్లు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని తెలిపారు. 

 

Sunday, November 11, 2018 - 20:48

హైదరాబాద్ : మహాకూటమి చర్చల్లో హైడ్రామా చోటు చేసుకుంది. తమకు తగిన సీట్లు ఇవ్వకపోతే కూటమి నుండి వైదొలుగుతామని టీజేఎస్, సీపీఐలు కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేశాయి. టీజేఎస్, సీపీఐ అల్టిమేటం నేపథ్యంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడతో ఫోన్‌లో కాంగ్రెస్ నేతలు ఉదయం నుంచి ...

Sunday, November 11, 2018 - 20:36

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని తాను కోరుకుంటున్నానని మోహన్‌బాబు చెప్పారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో ఆలయ...

Sunday, November 11, 2018 - 19:41

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మహాకూటమిలో చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. టీజేఎస్ ఆఫీస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ జరిపిన చర్చలు ముగిశాయి. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్...

Sunday, November 11, 2018 - 18:16

సిద్ధిపేట: గజ్వేల్ ప్రజలు టీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపిస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్‌లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలో సొంతిల్లు లేని వారు ఉండకూడదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లిలోని...

Sunday, November 11, 2018 - 17:33

హైదరాబాద్: తెలంగాణ జనసమితి(టీజేఎస్) ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. మహబూబ్‌నగర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు వదలిపెట్టొద్దని డిమాండ్ చేశాడు. సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీడీపీ నేత ఎల్.రమణ, టీజేఎస్ చీఫ్ కోదండరామ్...

Pages

Don't Miss