TG News

Monday, September 17, 2018 - 09:51

పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రోజుకో రేట్లు పెరుగుతూ రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, డీజిల్ పై 6 పైసలు ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. మళ్లీ ధర పెరగడంతో పలువురు బెంబేలెత్తుతున్నారు. 

  • న్యూఢిల్లీలో...
Monday, September 17, 2018 - 08:42

ఢిల్లీ : ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయదుందుభి మ్రోగించింది. అన్ని కీలక పోస్టులను క్లీన్ స్వీప్ చేశాయి. యునైట్ లెఫ్ట్ విజయ విజయ భేరీ మోగించింది. ప్రెసిడెంట్‌గా తెలంగాణ విద్యార్థి సాయి బాలాజీ గెలుపొందడం విశేషం. వైస్‌ ప్రెసిడెంట్‌గా సారికా చౌదరీ, ప్రధాన...

Monday, September 17, 2018 - 07:25

నల్గొండ : ఆదివారం కన్నీటి వీడ్కోలు మధ్య ప్రణయ్‌ అంత్యక్రియలు ముగిశాయి. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ అంతిమయాత్రలో పలువురు రాజకీయనేతలు, ప్రజా, కులసంఘాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న ప్రణయ్‌ సోదరుడు  అజయ్‌... అన్నయ్య పార్ధివ దేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రణయ్‌ భార్య అమృత తనకు సోదరిలాంటిదని... తామంతా ఆమెను కన్నకూతురిలా చూసుకుంటామన్నారు....

Sunday, September 16, 2018 - 18:27

నల్లగొండ : మిర్యాలగూడలో ప్రణయ్‌ అంతిమయాత్ర  కొనసాగుతోంది. ఈ యాత్రకు జనం భారీగా తరలి వచ్చారు. ప్రజాసంఘాల నేతలు ప్రణయ్‌ హత్యను తీవ్రంగా ఖండించారు.  అన్న ప్రణయ్  అంతిమయాత్రలో పాల్గొన్న తమ్ముడు అజయ్ భోరున విలపించాడు. కాగా హత్యపై  దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రణయ్‌ హత్యకు సంబంధించి ఐదుగురిని అదుపులోకితీసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగతంతంగా చేశారు. కాగా...

Sunday, September 16, 2018 - 16:16

హైదరాబాద్ : సనత్ నగర్ లో ఈరోజు జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. 2002లో గుజరాత్ లో నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. 2004లో వాజ్ పేయి ముందస్తుకు వెళ్లలేదా? అని అడిగారు. మీరు...

Sunday, September 16, 2018 - 14:41

తూర్పుగోదావరి : పోలీసుల గన్స్ మిస్ ఫైర్ కావటం సర్వసాధారణంగా మారిపోయింది. ఇటువంటి ఘటనలో ఒకోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్సి సందర్భాలలో మాత్రం కొందరు ప్రాణాలతో బైటపడుతున్నారు. ఇటువంటి ఘటనే జిల్లాలోని కూనవరం పీఎస్ లో చోటుచేసుకుంది. మిస్ ఫైర్ అయిన బుల్లెట్ శ్రీనివాస్ అనే ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ పొట్టలోకి దూసుకుపోయింది. దీంతో శ్రీనివాస్...

Sunday, September 16, 2018 - 13:15

హైదరాబాద్ : పరీక్షలు..ఒక్కో పరీక్షకు నిబంధనలు అమలు చేస్తుంటారు. కానీ వీఆర్వో పరీక్ష సందర్భంగా అధికారులు పెట్టిన నిబంధనపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటన నర్సాపూర్ లో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వో పరీక్షలు ప్రారంభమయ్యాయి. 700 పోస్టులకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్...

Sunday, September 16, 2018 - 11:14

నల్గొండ : ప్రణయ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మిర్యాలగూడకు చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ నేత ఖరీం ఉండడం మరింత సంచలనం రేకేత్తిస్తోంది. అమృత అనే యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ ని అమ్మాయి తండ్రి దారుణంగా చంపించిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 

ఈ కేసులో అమృత... తండ్రి, బాబాయ్‌ని...

Sunday, September 16, 2018 - 09:51

ఢిల్లీ : పెట్రోల్...డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు ధరలు అదుపులోకి వస్తాయా ? రావా ? అని మథన పడుతున్నాడు. కేంద్రం కూడా ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయి. 

ధరలు పెరుగుతూ రికార్డులు...

Sunday, September 16, 2018 - 09:37

హైదరాబాద్ : ఇది వీఆర్వో కొలువుల పరిస్థతి...భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ అర్హతతో కూడిన ఈ పోస్టులకు ఉన్నత విద్య అభ్యసించిన వారు సైతం కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. అంటే ఒక్క పోస్టుకు 1512 మంది పోటీ పడుతున్నారన్నమాట. ఈనెల 16న రాత  రాత పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 2945 పరీక్షా కేంద్రాలను టీఎ్‌సపీఎస్సీ ఏర్పాటు...

Sunday, September 16, 2018 - 09:03

నల్గొండ : జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ప్రణయ్ అనే వ్యక్తిని మారుతీరావు చంపించిన సంగతి తెలిసిందే. దీనిపై దళిత సంఘాలు భగ్గమన్నాయి. తన తండ్రిని ఉరి తీయాలని అమృత పేర్కొంటోంది. ఇదిలా ఉంటే ప్రణయ్ అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. ఉక్రెయిన్ లో ఉండే ప్రణయ్ సోదరుడు...

Saturday, September 15, 2018 - 21:56

వరంగల్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బస చేసిన గెస్ట్‌హౌస్‌ను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ముట్టడించారు. భారీగా తరలివచ్చి బైఠాయించారు. అయితే.. ఇది ఆయనకు వ్యతిరేకంగా కాదు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టి.రాజయ్యకు పార్టీ కేటాయించిన టికెట్‌ను రద్దు చేయాలని, కడియమే అక్కడి నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. కార్యకర్తలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్ని...

Saturday, September 15, 2018 - 20:50

ఢిల్లీ : కేంద్ర ఈసీ ముందు కాంగ్రెస్‌ పలు అభ్యంతరాలను లేవనెత్తింది. తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని.. వాటిని సరిదిద్దాకే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో 30 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని.. 18 లక్షల మందికి ఏపీ, తెలంగాణ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. 2019 జనవరి 4కి...

Saturday, September 15, 2018 - 19:53

హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు చేశారు. అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీచేసినా తమ పార్టీయే గెలుస్తుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణలో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఆయనపై అసదుద్దీన్‌ ట్వీటర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్నఐదు స్థానాలను కూడా బీజేపీ మళ్లీ ఎన్నికల్లో గెలవలేదని పేర్కొన్నారు....

Saturday, September 15, 2018 - 18:30

మహబూబ్ నగర్ : టీఆర్ ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిందని అమిత్ షా నిలదీశారు. ఎవరికి భయపడి 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వడానికి వేళ్లేదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్  ఇవ్వాలన్నారు. 2014లో గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని...

Saturday, September 15, 2018 - 18:16

మహబూబ్ నగర్ : తెలంగాణలో ఎన్నికలు వచ్చే మే లో జరగాలి కానీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మే లో ఎన్నికలు జరిగితే గెలుస్తామని కేసీఆర్ కు నమ్మకం లేదని తెలిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల శంఖారావం సభలో షా మాట్లాడుతూ ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగితే గెలుస్తారా అని ప్రశ్నించారు. ఓవైసీకీ భయపడే...

Saturday, September 15, 2018 - 17:31

నల్గొండ : మిర్యాలగూడలో నిన్నజరిగిన యువకుడు ప్రణయ్ హత్య కలకలం సృష్టిస్తోంది. తన తండ్రే ప్రణయ్ ను హత్య చేయించారని ప్రణయ్ భార్య అమృత ఆరోపించారు. హంతకుడైన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్యకు ముందు అనేక సార్లు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. తన భర్తను హత్య చేయిస్తాడని ఊహించలేదని వాపోయింది. 

మిర్యాలగూడలో ప్రణయ్ దారుణహత్యకు...

Saturday, September 15, 2018 - 16:14

హైదరాబాద్ : నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అనునిత్యం ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు చిన్నపిల్లలను సైతం వదలం లేదు. రోజు రోజుకూ మానవత్వం మంటగలిసి పోతోంది. హైదరాబాద్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయినా ఓ కామపిశాచి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని ఆజాన్...

Saturday, September 15, 2018 - 15:34

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటీ అయింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిటీల ఏర్పాటుపై స్ర్కీనింగ్ కమిటీ దృష్టి సారించింది.  ఎన్నిక లకు టికెట్లు కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ప్రచార, సమన్వయ, మేనిఫెస్టో కమిటీల ఏర్పాటుపైనా చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని...

Saturday, September 15, 2018 - 13:47

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు హైదరాబాద్ కు పరారయ్యారని సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు నగరానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఏ1 నిందితుడు మారుతీరావు, ఏ 2 నిందితుడు శ్రవణ్ కుమార్ ఉన్నట్లు...

Saturday, September 15, 2018 - 13:05

వరంగల్ : జిల్లాలో టీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీలో వర్గ విబేధాలు ముదిరి పాకాన పడ్డాయి. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లడం...105 నియోజకవర్గాలకు అభ్యుర్థులను ప్రకటించని సంగతి తెలిసిందే. కానీ టికెట్ ఆశించిన వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదిలా ఉంటే స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రం అభ్యర్థి రాజయ్య వద్దని కడియం రావాలని టీఆర్ఎస్ నేతలు...

Saturday, September 15, 2018 - 13:03

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శనివారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లడారు. కేసీఆర్ ప్రభుత్వంపై పలు విమర్శలు..ప్రశ్నలు సంధించారు. జమిలి ఎన్నికలను కేసీఆర్ మొదట సమర్థించారని, కానీ ముందస్తుకు వెళ్లారని తెలిపారు...

Saturday, September 15, 2018 - 08:49

నల్గొండ : జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మిర్యాలగూడలో పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. గర్భవతి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తున్న ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. ప్రణయ్ మామ మారుతీరావు ఈ హత్యలో కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ప్రేమ వివాహే కారణమని పోలీసులు నిర్దారించారు. హత్య నేపథ్యంలో మిర్యాలగూడ బంద్ కు దళిత...

Saturday, September 15, 2018 - 07:57

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. పాలమూరు బహిరంగ సభ వేదికగా...ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఒంటరిగా వెళ్లాలని డిసైడ్ బీజేపీ నేతలకు....దిశానిర్దేశం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు సూచనలు చేయనున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి...

Saturday, September 15, 2018 - 07:19

హైదరాబాద్ : తెలంగాణాలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని మండి పడ్డారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను టార్గెట్‌ చేసిందని ఆరోపిస్తున్నారు. బలమైన కాంగ్రెస్‌ నేతలను అక్రమ కేసులతో టీఆర్ఎస్‌  వేధిస్తోందంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌ నేతలను భయభ్రాంతులకు...

Saturday, September 15, 2018 - 07:06

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఈవీఎం మిషన్లు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు... ప్రక్రియను...

Friday, September 14, 2018 - 22:46

నల్గొండ : జిల్లాలో పరువు హత్య జరిగింది. మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు పెరమళ్ల ప్రణయ్‌గా గుర్తించారు. ఆరు నెలల క్రితం ప్రణయ్‌ ఓ కోటీశ్వరుడి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి నుంచి ప్రాణహాని ఉందని గతంలో ప్రణయ్‌ పోలీసలకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే.. ఈరోజు గర్భవతి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి...

Pages

Don't Miss